Wine Shop: మద్యం ప్రియులకు షాక్.. మూతపడనున్న వైన్ షాపులు..
రాష్ట్రంలో మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ప్రచారం ముగియగానే వైన్ షాపులు కూడా క్లోజ్ చేయనున్నారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వైన్ షాపులు మూసివేయనున్నారు. విషయం తెలుసుకున్న మందు బాబులు వైన్స్ ల వద్దకు వచ్చి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ మాత్రం దొరకడం లేదు. ఇప్పకిటే బ్రాండ్స్ లిక్కర్ చాలా షాపుల్లో అయిపోయింది.
హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైన్ షాపులు ఖాళీ అయ్యాయని చెబుతున్నారు. టాప్ బ్రాండ్ల లిక్కర్ మొత్తం అమ్ముడైపోయినట్లు లిక్కర్ షాపు యజమానులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని వైన్ షాపుల్లో కేవలం ఒకటి, రెండు బ్రాండెడ్ లిక్కర్లు మాత్రమే లభిస్తున్నాయి. కాసేపు అయితే ఇవి కూడా అందుబాటులో ఉండవని చెబుతున్నారు. ఇక బీర్లలో కేఎఫ్ తప్పా మిగతా బ్రాండ్లు అన్ని అమ్ముడుపోయాయి.

చాలా షాపుల్లో బీర్లు దొరగడం లేదు. ఉన్న కేవలం కేఎఫ్ మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. చాలా మంది నచ్చిన బ్రాండ్ దొరక్కున్నా ఉన్న వాటితో గొంతు తడుపుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే వేల లీటర్ల లిక్కర్ ను కొనుగోలు చేశారు.
మరో వైపు పోల్ మేనేజ్ మెంట్ టీమ్స్.. లిక్కర్ షాపులతో డీల్స్ పెట్టుకున్నాయి. చివరి రెండు రోజులు ఓటర్లు, పోల్ బూత్ కమిటీ సభ్యులకు, ఓటర్ స్లిప్స్ రాసే కుర్రోళ్లు మద్యం పంపిణీ చేసే అవకాశం ఉంది.
వైన్ షాపులు మూసివేసినా.. ఎమ్మెల్యే అభ్యర్థులు మద్యం పంపిణీ చేస్తారన్న ధీమాతో ఉన్నారు మద్యం ప్రియులు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మద్యం పంపిణీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మద్యంతో పాటు డబ్బులు కూడా పంచుతున్నారట. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటు రూ.5 వేలు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఓటును నోటు అమ్ముకుంటే.. భవిష్యత్ అంధకారం అవుతుందని ఓటర్లు గుర్తుంచుకోవాల్సిన అంశమని మేధావులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications