మిస్టరీ: గచ్చిబౌలిలో విప్రో ఉద్యోగిని మృతి, హత్యా లేక ఆత్మహత్య?

హైదరాబాద్: గచ్చిబౌలిలో విప్రో కంపెనీ పనిచేసే ఐటీ ఉద్యోగిని బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇందిరానగర్‌లో తాను ఉంటున్న బాలాజీ హాస్టల్ భవనంపై నంచి కిందపడి రాణిమిశ్రా మృతి చెందినట్లు గుర్తించారు. జార్ఖండ్‌కు చెందిన రాణిమిశ్రా గత కొంతకాలంగా ఉద్యోగం చేస్తూ ఇదే హాస్టల్‌లో ఉంటున్నారు.

Wipro employee rani mishra suicide at indira nagar, Hyderabad

మృతురాలిని విప్రో సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న రాణి మిశ్రా(29) గా గుర్తించారు. మంగళవారం రాత్రి చీకటి పడ్డాక రాణి మిశ్రా కనిపించకుండా పోయింది. అయితే బుధవారం తెల్లవారుజామున హాస్టల్ వెనుక రాణిమిశ్రా మృతదేహాన్ని హాస్టల్ యాజమాన్యం గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. రాణిమిశ్రా ఎక్కువగా దైవ చింతనలో ఉండేదని స్ధానికులు పోలీసులకు తెలిపారు. ఎప్పుడూ ఒంటరిగా ఉండేదని, హాస్టల్ యాజమాన్యం సైతం చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే రాణిమిశ్రాది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వృద్ధురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పోతారం గ్రామ శివారులో ఓ వృద్ధురాలు(65) అత్యాచారానికి గురైంది. వృద్ధురాలు జిన్నారం మండలం కానుకుంటలోని బంధువుల ఇంటికి వెళ్లి సోమవారం సాయంత్రం తిరుగు ప్రయాణమైంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పోతారం బస్టాండ్ వద్ద దిగింది.

రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. గ్రామంలో దింపుతామని ఆమెను బైక్‌పై ఎక్కించుకున్నారు. ఆ తర్వాత కిలోమీటర్ వెళ్లాక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు.

తీవ్ర రక్తస్రావంతో ఇబ్బంది పడుతూ ఇంటికి చేరుకున్న ఆ వృద్ధురాలు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంటనే ఆమెను తూప్రాన్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి, అటు నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+