Telangana: ప్రాజెక్టులకు జల కళ.. భారీగా వస్తోన్న వరద..
తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద చేరుతోంది. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి భారీగా వరద రావడంతో ప్రాజెక్టులు నిండు కుండలా మారింది. జూరాల ప్రాజెక్టులో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 90,800 క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అధికారులు చెబుతున్నారు.
అధికారులు 17 గేట్లు ఎత్తి 66,810 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,084 క్యూసెక్కులు వదలుతున్నారు. జూరాల ప్రాజెక్టు మొత్తం నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.50 మీటర్లు నీటిమట్టం ఉందని అధికారులు పేర్కొన్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 7.645 టీఎంసీలగా ఉంది.

ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు 1,04,416 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. అధికారులు 99,894 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌కు కూడా భారీగా వరద వస్తోంది. సాగర్‌లో ప్రస్తుతం 504.50 అడుగుల వద్ద నీరు నిల్వ ఉండగా ప్రాజెక్టు నుంచి 9,874 క్యూసెక్కులు దిగువకు వదిలారు. ఇటు గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులకు కూడా భారీగా వరద వస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది.
ప్రస్తుతం ప్రాజెక్టులోకి 14,063 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1067.10 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టుకు నీటి నిల్వ 80.5 టీఎంసీలు కాగా ఇప్పుడు 18.833 టీఎంసీలుగా ఉంది. ఎల్లంపల్లికి కూడా వరద కొనసాగుతోంది. అయితే కృష్ణా బేసిన్ భారీగా వరద వస్తోంది. కానీ గోదావరి బేసిన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి వరద కొనసాగుతోంది. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లికి నామ మాత్రపు వరద వస్తోంది. ఇక నిర్మల్ జిల్లాలోని స్వర్ణ జలాశయానికి 6480 క్యూసెక్కుల వరద వస్తోంది. అటు గోదావరిలో కూడా వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications