కేసీఆర్ చెప్పింది చేస్తే ఇరుక్కుంటామా? మల్లారెడ్డి ఎపిసోడ్ తో గులాబీ నేతల్లో అంతర్మధనం!!
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో గులాబీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను తిప్పి కొట్టాలని, ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేస్తే ఎదురుదాడి చేయాలని పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ సలహా ఇచ్చారు. ఇక కేసీఆర్ చెప్పిందే శిరోధార్యంగా భావించి మంత్రి మల్లారెడ్డి దానిని ఆచరణలో పెట్టారు.
ఆయన ఐటి అధికారుల పైన సంచలన ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టడం, తిరిగి ఐటీ అధికారులు మల్లారెడ్డి పైన కేసు పెట్టడం, మల్లారెడ్డి ఆస్తుల పైన ఐటీ అధికారులు ఈడీ అధికారులకు లేఖలు రాస్తున్నారు అన్న ప్రచారం వెరసి గులాబి నేతలకు గుబులు పట్టుకుంది. సీఎం కేసీఆర్ చెప్పింది చేస్తే మరింత ఇరుక్కుంటామనే భావన వ్యక్తమవుతోంది.

మల్లారెడ్డి ఎపిసోడ్ చూసి భయ పడుతున్న గులాబీ నేతలు
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులను ఎదుర్కోవడానికి పార్టీ నేతలను సమాయత్తం చేయాలని భావించారు. ఇందులో భాగంగా సమావేశం నిర్వహించి మరీ ఎదురు దాడులు చేయాలని, అవసరమైతే కేసులు పెట్టాలని వారికి హితోపదేశం చేశారు.
కెసిఆర్ మా వెనక ఉన్నారు.. ఆయన మాటే శిరోధార్యమని భావించిన నేతలు ఇప్పుడు మల్లారెడ్డి ఎపిసోడ్ చూసి కాస్త భయపడుతున్నారు. అనవసరంగా కేంద్ర దర్యాప్తు సంస్థ లతో పెట్టుకుంటే ముందు ముందు మరిన్ని ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని భయపడుతున్నారు.

మల్లారెడ్డిపై కేసు.. ఆపై ఈడీకి లేఖ... స్థానిక పోలీసులపైనా ఐటీ అధికారుల ఒత్తిడి
ఇక మల్లారెడ్డి ఎపిసోడ్ ను వదిలిపెట్టని ఐటి అధికారులు భవిష్యత్తులో దాడులు చేస్తే మిగతా వారు కూడా మల్లారెడ్డి మాదిరిగా ప్రవర్తించకుండా ఉండటం కోసం మల్లారెడ్డి ఎపిసోడ్ ను సీరియస్ గానే తీసుకుంటున్నారు. మల్లారెడ్డి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు, మంత్రి మల్లారెడ్డి తమపై చేసిన ఫిర్యాదుపై శుక్రవారం నాడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇక ఐటి అధికారులు తమ ల్యాప్ టాప్ పట్టుకొని వెళ్లారని, తమ ల్యాప్ టాప్ తమకు తెచ్చి ఇవ్వాలని స్థానిక పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నారు. అంతేకాదు మరోవైపు మల్లారెడ్డి మెడికల్ కళాశాలలలో వందల కోట్ల వసూలు జరిగాయని ఐటి అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వారు ఈడీకి లేఖ రాసి, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను రంగంలోకి దించనున్నారని చర్చ జరుగుతుంది.

కేసీఆర్ మాటలు విని బుక్కయిన మల్లారెడ్డి.. దాడులు జరిగినా సైలెంట్ గా ఉంటేనే ఉత్తమం
దీంతో సీఎం కేసీఆర్ మాటలు విని మల్లారెడ్డి అనవసరంగా ఐటి అధికారులతో పంచాయితీ పెట్టుకున్నారు అన్న చర్చ గులాబి నేతల్లోనూ వ్యక్తమౌతుంది. ఒకవేళ ఐటి దాడులు జరిగినా, ఈడీ దాడులు జరిగినా ఎదురుతిరిగి ఇష్యూని కాంప్లికేట్ చేసుకునే బదులు, సైలెంట్ గా అధికారులకు సహకరిస్తే పోతుందని చర్చ జరుగుతుంది. ఇక ఇదే సమయంలో టిఆర్ఎస్ పార్టీలో 11మంది నేతలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో బడా వ్యాపారాలు నిర్వహిస్తున్న టిఆర్ఎస్ పార్టీ నేతలు కొందరు ఇప్పటినుంచే అన్ని విషయాల్లో అప్రమత్తం అవుతున్నట్టుగా సమాచారం.

కేసీఆర్ మాటలు అన్ని సమయాల్లో వినటం మంచిది కాదు
గులాబీ అధినేత చెప్పిన మాటలు వినాలి కానీ, అన్ని సందర్భాల్లోనూ వింటే దెబ్బతినేది మనమే అన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి మల్లారెడ్డి తాజా ఎపిసోడ్ ను చాలా జాగ్రత్తగా గమనిస్తున్న గులాబీ నేతలు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్నదానిపై మల్లారెడ్డి చేసిన ప్రయోగంతో ఒక అంచనాకు వస్తున్నారని సమాచారం.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications