దారుణం: మహిళపై గ్యాంగ్ రేప్, ఫిర్యాదు
కరీంనగర్: నగరంలోని కోతిరాంపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు కరీంనగర్ పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను మూసా, మున్నా, చాంద్ లుగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు సమీపంలో ఉన్న పోలేపల్లి సెజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications