పరువు పోయింది: ప్రియుడి మిస్టరీ వీడక ముందే, యువతి సూసైడ్

Posted By:
Subscribe to Oneindia Telugu

భువనగిరి: ప్రేమ వివాహం విషయమై ప్రియుడి అదృశ్యం మిస్టరీ వీడక ముందే ప్రేమికురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆత్మకూరు(ఎం) మండలంలో కలకలం రేపింది. లింగరాజుపల్లికి చెందిన స్వాతి, పల్లెర్ల గ్రామానికి చెందిన నరేష్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వివాహం చేసుకున్న రెండు నెలల్లోనే యువకుడు నరేష్‌ అదృశ్యమయ్యాడు. తాజాగా, స్వాతి మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర సంచలనం కలిగించిన యువకుడి అదృశ్యం వెనుక యువతి తండ్రి ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. దీంతో అతని తండ్రి కోర్టును ఆశ్రయించారు.

వేధింపులు: హైదరాబాద్‌లో విజయవాడ టెక్కీ భార్య ఆత్మహత్య

ఈ నేపథ్యంలో యువతి ఓ సూసైడ్‌ నోట రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన అ నేక అనుమానాలకు తావిస్తోంది. మే 2వ తేదీన భువనగిరి బస్టాండ్‌లో అదృశ్యమైన యువకుడు నరేష్‌ ఘటనపై భువనగిరి టౌన్ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మంగళవారం లింగరాజుపల్లిలో ఇంట్లో స్వాతి ఆత్మహత్య ఘటనపై ఆత్మకూర్‌(ఎం) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Woman commits suicide after husband missing

ఆత్మకూర్‌(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన నరేష్‌(24), అదే మండలం లింగరాజుపల్లికి చెందిన స్వాతి(22) మధ్య కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం సాగంది. వేర్వేరు కులాలకు చెందిన వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించరని తెలిసి ఇంటినుంచి పారిపోయారు.

2017 మార్చి 21న ముంబైలోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇంటి నుంచి కూ తురు పరారు కావడంతో యువకుడి బంధువులపై ఒత్తిడి తెచ్చి వారిని తిరిగి ఇంటికి రప్పించారు. అనంతరం ప్రేమజంటకు కౌన్సెలింగ్ ఇప్పించారు.

పెళ్లిని రద్దు చేసుకుని ఎవరి దారిన వారు విడిపోవడానికి నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే స్వాతి తిరిగి నరేష్‌ను వెతుకుంటూ ముంబై చేరుకుంది. మళ్లీ ఇంటి నుంచి కూతురు పారిపోవడంతో ఆమె తండ్రి యువకుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి అన్ని మరిచిపోయి కలిసి ఉందామని చెప్పి, రప్పించాడు.

మే 2వ తేదీన స్వయంగా నరేష్‌.. స్వాతిని వెంట తీసుకు వచ్చి భువనగిరి బస్టాండులో ఆమె తండ్రికి అప్పగించాడు. భువనగిరి బస్టాండ్‌ నుంచి వెనుదిరిగి వెళ్లిన నరేష్‌ ఆచూకీ లేకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన అతని తండ్రి వెంకటయ్య, ఇతర కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని కోసం దర్యాఫ్తు చేస్తున్నారు. యువతి తండ్రిపై అనుమానాలు వ్యక్తం చేశారు.

మరోవైపు, తాజాగా స్వాతి మంగళవారం తన పుట్టింటిలో ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామునే బాత్రూంలో ఉరిపోసుకుందని, ఇది గమనించి ఆమెను తీసుని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకొస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందినట్లు స్వాతి తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఆత్మహత్యకు ముందు సూ సైడ్‌నోట్‌ రాసి పెట్టింది. అందులో తన ఇష్టంతో పెళ్లి చేసుకున్నానని, అయితే తాను తప్పు చేశానని తెలుసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చానని పేర్కొంది. తన కారణంగా పరువు పోయిందని, తన తండ్రిని పోలీసులు తరుచూ పిలిస్తుండటంతో తనకు బాధ కలుగుతోందని, తన తండ్రిని ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను కోరింది.

ఇంటికొచ్చాక టాయిలెట్స్‌ క్లీన చేసే యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసిన స్వాతి ఆసుపత్రి నుంచి డిచ్ఛార్జీ అయిన మరుసటి రోజే బాత్రూంలో చున్నీతో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు శవాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. మంగళ వారం సాయంత్రం అంత్యక్రియలు ముగిశాయి.

భర్త, అత్తమామల వరకట్న వేధింపులు భరించ లేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని స్వా తి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Woman commits suicide after husband missing in Yadadtri Bhongir district.
Please Wait while comments are loading...