షాకింగ్.. చీమలకు భయపడి మహిళ ఆత్మహత్య !

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పీఎస్ పరిధిలోని నవ్య హోమ్స్‌లో ఓ హృదయ విదారక సంఘటన వెలుగు చూసింది. చీమలకు భయపడి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మైర్మేకోఫోబియా (Myrmecophobia.. అంటే చీమలంటే విపరీతమైన భయం కారణంగా ద్యావనపెళ్లి మనీషా (25) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మనీషాకు 2022 సంవత్సరంలో మంచిర్యాల వాసి అయిన చిందం శ్రీకాంత్ (35)తో వివాహం జరిగింది. వారికి అన్విక (3) అనే మూడేళ్ల కుమార్తె ఉంది. వివాహమైన రెండేళ్ల తర్వాత ఉద్యోగరీత్యా భార్యాభర్తలిద్దరూ అమీన్‌పూర్‌కు వచ్చి నవ్య హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు.

Woman Commits Suicide Due to Fear of Ants in Sangareddy

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మనీషాకు చిన్నప్పటి నుంచే చీమలు అంటే తీవ్ర భయం (ఫోబియా) ఉంది. నవంబర్ 4, 2025(మంగళవారం) నాడు ఉదయం భర్త శ్రీకాంత్ డ్యూటీకి వెళ్లిపోయాడు.సాయంత్రం 05:30 గంటల సమయంలో భర్త శ్రీకాంత్ ఇంటికి తిరిగి వచ్చాడు. మెయిన్ డోర్ లోపలి నుంచి గడిపెట్టి ఉండడంతో, చుట్టుపక్కల వారి సహాయంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. మనీషా ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది.

చీమల భయం.. చివరి లేఖ
మనీషా మృతదేహం పక్కనే ఆమె రాసిన లేఖ లభించింది. ఈ లేఖలో తన ఆత్మహత్యకు గల కారణాన్ని, భర్తకు ముఖ్యమైన సందేశాలను పేర్కొంది. "శ్రీ అయామ్ సారీ, ఈ చీమలతో బ్రతకడం నా వల్ల కాదు, అన్వి జాగ్రత్త, అన్నవరం, తిరుపతి హుండీలో 1116 రూపాయలు, ఎల్లమ్మ వడి బియ్యం మర్చిపోకు" అని రాసి ఉంది. ఈ లేఖ ద్వారా 'మైర్మేకోఫోబియా' (చీమలు అంటే భయం) కారణంగా ఆమె ఎంతగానో మనస్తాపం చెంది, ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అమీన్‌పూర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మనీషా డెడ్ బాడీని మంచిర్యాలలోని వారి స్వగ్రామానికి తరలించారు. ఈ ఘటనపై అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+