మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య: ఆసరాకు బలి
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. లక్నోకు చెందిన ఆ కానిస్టేబుల్ ప్రతిభాదేవి బలవన్మరణానికి పాల్పడిందనది స్థానిక పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణం కావచ్చునని భావిస్తున్నారు.

ముంబై ముఠా పట్టివేత
వ్యాపారవేత్తలను టార్గెట్‌గా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతున్న ఏడుగురి సభ్యుల ముంబై మాఫియా ముఠాని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 2 కంట్రీమేడ్ పిస్టోళ్ళు, 14 రౌండ్ల బులెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఆసరా తొక్కిసలాటలో వృద్ధుడి మృతి
హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి సత్యానగర్‌లో విషాదం జరిగింది. ఆసరా పెన్షన్ల పంపిణీలో తొక్కిసలాటకు మరో ముసలి ప్రాణం బలైంది. సత్తయ్య(70) అనే వృద్ధుడు పెన్షన్ కోసం పంపిణీ కేంద్రం వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ పెన్షనర్లు బారులుతీరి ఉన్నారు. ఆ క్యూలైన్లోకి వెళ్లిన సత్తయ్య తొక్కిసలాటలో మరణించారు.












Click it and Unblock the Notifications