హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐటి కార్యదర్శి పేరుతో నకిలీ ఫేస్‌బుక్: అసభ్యకరమైన వ్యాఖ్యలు, యువతి అరెస్టు

తెలంగాణ ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ క్రియేట్ చేసి, అసభ్యకరమైన వ్యాఖ్యలను పోస్టు చేసిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి, అసభ్యకరమైన వ్యాఖ్యలను పోస్టు చేసిన యువతిని పోలీసులు సోమవారంనాడు అరెస్టు చేశారు. దాదాపు 20 ఏళ్ల వయస్సు గల ఆ యువతి ఐఎఎస్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది.

యువతి డిప్రెషన్‌కు లోనైనట్లు కనిపిస్తోందని, మానసికంగా బలహీనంగా కనిపిస్తోందని పోలీసులు చెప్పారు. జయేష్ రంజన్ చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని విన్న యువతి ఆ నకిలీ ఫేస్‌బుక్ ఖాతను తెరిచిందని పోలీసులు అంటున్నారు. ఆ యువతి పేరు వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు.

woman creates fake Facebook account of Telangana IT secretary, gets arrested

జయేష్ రంజన్ తరఫున ఆయనయ వ్యక్తిగత సహాయకుడు టి. నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి జయేష్ రంజన్ పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి, అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్టు చేశారని, అది రంజన్‌కు తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తోందని నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఐపి అడ్రస్‌ను గుర్తించి, అనుమానితురాలని పట్టుకున్నారు. ఆ యువతి హైదరాబాదులోని గాంధీనగర్‌లో ఉంటూ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

English summary
A woman IAS aspirant in her late twenties was arrested by the Telangana police on Monday for creating a fake Facebook profile of Telangana IT secretary Jayesh Ranjan and posting abusive content on social media The women might have been suffering from depression and showed signs of not being mentally fit, the police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X