మహిళ గ్యాంగ్ రేప్, తాగిన బీరు సీసాతో చంపేశారు!

హైదరాబాద్: సికింద్రాబాదులో దారుణం జరిగింది. పాత గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలోని నిర్జన ప్రదేశంలో ఓ మహిళను కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలి వయస్సు దాదాపు నలభై వరకు ఉంటుంది.

పాత గాంధీ ఆసుపత్రి స్థలంలో మెట్రో నిర్మాణ పనులు సాగుతున్నాయి. దీంతో రాత్రి సమయంలో అక్కడ నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడి చెట్ల పొదల మధ్య ఓ మహిళ మృతి చెదినట్లు మంగళవారం ఉదయం మార్కెట్ పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.

 Woman gang raped and murdered

రక్తపు మడుగులో మహిళ మృతదేహం పడి ఉంది. ఆమె పైన అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ ఖాళీ గ్లాసులు, పగిలిన బీరు సీసాలు కూడా ఉన్నాయి. నిందితులు మద్యం సేవించి ఉంటారని భావిస్తున్నారు.

వారు అదే బాటిల్‌తో మహిళను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు జాగిలాలను పోలీసులు రంగంలోకి దించారు. అవి ఓ మద్యం దుకాణం వద్ద ఆగిపోయాయి. దీంతో ఆ మద్యం దుకాణంలో నిందితులు బీరు కొని ఉంటారని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+