వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలులో గర్బిణీ డెలివరీ, పండంటి బిడ్డ జననం: ఫోటో పోస్ట్ చేసిన పీయూష్, నెటిజన్ల ప్రశంసలు..

|
Google Oneindia TeluguNews

ఆమె నిండు చులాలు.. రేపో, మాపో అనగా డెలివరీ. కానీ సికింద్రాబాద్- హౌరా స్పెషల్ ట్రైన్‌లో ప్రయాణిస్తోంది. నొప్పులు రావడంతో రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైల్వై వైద్యులు వచ్చి.. గర్భవతిని డెలివరీ చేశారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రసవానికి సంబంధించి రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

ఈ నెల 24వ తేదీన గర్భవతికి రైల్వే వైద్యులు ప్రసవం చేశారని ఆయన తెలిపారు. బాలింత, అప్పుడే పుట్టిన మగ బిడ్డ ఫోటోను కూడా షేర్ చేశారు పీయూష్ గోయల్. ప్రపంచంలోకి అడుగిడిన చిన్నారికి భారతీయ రైల్వే స్వాగతం చెబుతోంది అని పీయూష్ పేర్కొన్నారు.

Woman gives birth to baby boy onboard Secunderabad-Howrah Special train..

దీనికి నెటిజన్లు కూడా స్పందించారు. హ్యాట్సాప్ రైల్వే డాక్టర్స్ అంటూ అభినందనలు తెలిపారు. గుడ్ జాబ్ అని కొందరు, సెల్యూట్ ఇండియన్ రైల్వే అని మరికొందరు కామెంట్ చేశారు. మంచి టీం వర్క్‌తో గర్భిణీకి డెలివరీ చేసినందుకు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మరోవైపు ఈ నెల మొదటివారంలో కూడా ఒక డెలివరీ జరిగింది. శ్రామిక్ రైలులో కేరళ నుంచి అసోం గోల్ ఘాట్ వస్తున్న.. గర్బిణీ కూడా శ్రామిక్ రైలులో డెలివరీ అయ్యింది. మరో కంపార్ట్ మెంట్‌లో ఉన్న మహిళ సాయంతో డెలివరీ జరిగింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.

English summary
woman delivered a healthy baby boy onboard the Secunderabad-Howrah Special train on June 24, Railway Minister Piyush Goyal announced on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X