అపోలో ఆసుపత్రిలో పని చేసే లేడీ జూనియర్ డాక్టర్ అదృశ్యం
హైదరాబాద్: అపోలో ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌గా పని చేస్తున్న నాగదుర్గా రాణి బుధవారం ఉదయం అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
నాగదుర్గా రాణి కూకట్ పల్లి ప్రాంతంలో నివసిస్తోంది. బుధవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదు. దీంతో, రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె స్నేహితులు, సహోద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
నాగదుర్గా రాణి కూకట్‌పల్లిలోని బాలాజీనగర్లో ఉంటోంది. బుధవారం సాయంత్ర విధుల కోసం ఇంటి బయటకు వెళ్లింది. ఆ తర్వాత తిరిగి రాలేదు. నాగదుర్గా రాణి అపోలో ఆసుపత్రిలో గత కొద్ది నెలలుగా జూనియర్ డాక్టర్‌గా పని చేస్తోంది.

ఆదిలాబాద్ జిల్లాలో విద్యుదాఘాతంతో నలుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో రెండుచోట్ల జరిగిన విద్యుదాఘాతం సంఘటనల్లో నలుగురు మృతి చెందారు. ఇంద్రవెల్లి మండలం పిప్పిరి గ్రామంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజ్జనం సందర్భంగా విద్యుత్ తీగలను వేలాడదీసే క్రమంలో షార్ట్‌సర్క్యూట్ జరిగింది.
ఈ ఘటనలో సంతోష్, రజనీకాంత్, కాశీరాం మృతి చెందారు. బ్యాండు మేళాలతో అంతా ఆనందంలో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా, తలమడుగు మండలం కొలాంగూడకు చెందిన కస్లీబాయి అనే యువతి సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతుండగా షాక్ తగిలి చనిపోయింది.












Click it and Unblock the Notifications