స్త్రీని చంపి రైల్వే పట్టాలపై పడేశారు (ఫొటో)
హైదరాబాద్: ఓ వివాహితను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆమె శవాన్ని రైల్వే పట్టాలపై పడేసిన ఘటన హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో గల కందిగల్ గేట్ వద్ద చోటు చేసుకుంది. చాంద్రాయణగుట్టలోని ఫూల్‌బాగ్ అహ్మద్ నగర్‌కు చెందిన రుహీనా (20)కు అదే ప్రాంతానికి చెందిన మోహిన్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదు నెలల బాబు ఉన్నాడు.
పెళ్లి జరిగిన కొద్ది కాలం నుంచే మోహన్ తరుచూ భార్యను అనుమానిస్తూ వేధిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కందిగల్ గేట్ రైల్వే బ్రిడ్జి సమీపంలోని పట్టాలపై రూహినా శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో కాచిగూడ రైల్వే పోలీసులు, ఛత్రినాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు

మెడపై చున్నీతో ఉరి వేసినట్లు మహిళ మెడపై గుర్తులు ఉండడంతో హత్యగా నిర్ధారించారు. వెంటనే డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. జాగిలాలు సంఘటనా స్థలం నుంచి చుట్టు పక్కల తిరుగుతూ స్థానిక బస్తీలోని షాలిమార్ హోటల్ వరకు వెళ్లి ఆగిపోయాయి. కాగా, భర్త మోహన్‌యే ఆమెను హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
మోహిన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో అతను మంగళవారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత మహిళ మృతదేహాన్ని కాచిగుడా రైల్వే ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications