స్త్రీలను వాడుకుని వదిలేయడం నామా నేచర్: సుంకర సుజాత

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావుపై బాధిత మహిళ సుంకర సుజాత మీడియాకు ఎక్కారు. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళలను వాడుకుని వదిలేసి, బ్లాక్ మెయిల్ చేయడం నామా స్వభావమని ఆమె ఆరోపించారు.

చిక్కుల్లో నామా: నగ్నచిత్రాలున్నాయని బెదిరిస్తున్నట్లు మహిళ ఆరోపణ

సుంకర సుజాత సాక్షి టెలివిజన్ చానెల్ ప్రతినిధితోనూ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధితోనూ ఆమె మాట్లాడారు. కర్ణాటక మాజీ ఎమ్మెల్సీతో నామా నాగేశ్వర రావుతో ఉన్న సంబంధానికి సంబంధించిన విషయాలను ఆమె వెల్లడించారు. వివాహేతర సంబంధాలున్నాయని బయటి ప్రపంచానికి తెలియకూడదని నామా నాగేశ్వర రావు తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

నామా నాగేశ్వర రావు ఫేస్‌బుక్ ప్రొఫైల్ నిండా వేశ్యలే ఉన్నారని ఆమె వ్యాఖ్యానించాచరు. నామా నాగేశ్వర రావు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.

చంద్రబాబు పిఎకు వీడియోలు...

చంద్రబాబు పిఎకు వీడియోలు...

చంద్రబాబు పిఎ శ్రీనివాస్‌కు తాను నామా నాగేశ్వర రావుతో మాట్లాడిన ఆడియో, వీడియో టేపులను కూడా వాట్సప్ చేసినట్లు ఆమె తెలిపారు. అయితే, వారు పట్టించుకోలేదని ఆమె అన్నారు. రాజీ కోసం తన సోదరుడు నామా సీతయ్యను పంపించేవాడని ఆమె అన్నారు. నువ్వు బ్లాక్ మెయిలర్ అని ఎవరికైతే చెప్పావో వారికి తాను బ్లాక్ మెయిలర్ కాదని చెప్పాలని తాను అడిగినట్లు ఆమె తెలిపారు. చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

ఏం భయం లేదు....

ఏం భయం లేదు....

తనను అందరూ చూస్తారనే భయం తనకు లేదని, తన ముఖాన్ని బ్లర్ చేయవద్దని ఆమె సాక్షి మీడియా ప్రతినిదితో సుంకర సుజాత అన్నారు. తన భర్త అమెరికాలో ఉద్యోగం చేస్తారని, తాను కూడా అమెరికాలో పనిచేశానని ఆమె చెప్పారు. కేసు ఉపసంహరించుకోవాలని తనను నామా నాగేశ్వర రావు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆమె అన్నారు.

ఓ టిడిపి నేతతో రాయబారం....

ఓ టిడిపి నేతతో రాయబారం....

తెలంగాణ సీనియర్ నేత ఒకరి పేరు కూడా సుంకర సుజాత ప్రస్తావించారు. ఆ సీనియర్ నేతతో తాను మాట్లాడినట్లు ఆమె తెలిపారు. కేసు విత్‌డ్రా చేసుకోవాలని, నామా నాగేశ్వర రావు అడిగితేనే తాను కేసు ఉపసంహరించుకోవాలని అడుగుతున్నానని, లేకుంటే మీ మధ్యకు తాను ఎందుకు వస్తానని ఆ సీనియర్ నేత అన్నట్లు ఆమె తెలిపారు.

కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ....

కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ....

కర్ణాటక మాజీ ఎమ్మెల్సీతో నామా నాగేశ్వర రావు సహజీవనం చేసి మోసం చేశారని, ఆమె విషయం ఆమె తనకు చెప్పారని ఆమె అన్నారు. ఆ మాజీ ఎమ్మెల్సీ తనతో మాట్లాడిన విషయాలను కూడా తాను రికార్డు చేశానని ఆమె చెప్పారు. ఆమె పేరును కూడా ఆమె చెప్పారు. సహజీవనం చేసినట్లు ఆధారాలు లేకపోవడంతో ఆ మాజీ ఎమ్మెల్సీ కేసు నిలువలేదని చెప్పారు.

పెట్టుబడులు పెట్టడానికి....

పెట్టుబడులు పెట్టడానికి....

సుంకర సుజాతతో నామా నాగేశ్వర రావుకు 2013లో పరిచయం అయినట్లు తెలుస్తోంది. మధుకాన్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆమె ఆసక్తి కనబరిచి నామాతో పరిచయం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం బలపడినట్లు చెబుతున్నారు. నామా నాగేశ్వర రావు తనకు క్లోజ్ ఫ్రెండ్ అని సుంకర సుజాత కూడా చెప్పారు. ఆ విషయం బయటకు చెప్పాలని ఆమె నామాను డిమాండ్ చేశారు. ఆయన విషయాలు బయటకు చెప్తానని నామా నాగేశ్వర రావు తనపై కక్ష పెంచుకున్నారని ఆమె అన్నారు.

న్యూడ్ ఫోటోలు ఉన్నాయని....

న్యూడ్ ఫోటోలు ఉన్నాయని....

నామా నాగేశ్వర రావుకు సన్నిహిత అనుచురులు ఉన్నారని, వారికి తాను తెలుసునని చెప్పాలని తాను అడిగానని, వారికి ఆ విషయం చెప్తే తన పరువు పోతుందని అనుకుంటున్నారని సుంకర సుజాత అన్నారు. వారెవరో తనకు తెలియదని అన్నారు. తనను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రేరేపించారని అంటున్నారని, అదంతా అబద్దమని ఆమె అన్నారు. తుమ్మల పంపించాడని నామా నాగేశ్వర రావు చెబుతున్నారని, తాను ఫ్రెండ్‌నని చెప్పాలని, అయితే తనకు పరిచయం మాత్రమే ఉందని చెప్తానని ఆమె అన్నారు. కేవలం పరిచయం మాత్రమే ఉంటే సీతయ్య 20, 30 సార్లు నామా సోదరుడు సీతయ్య ఎందుకు వస్తారని అడిగారు.

 విజయవాడలో నామా....

విజయవాడలో నామా....

ఈ వివాదం చెలరేగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడైన నామా నాగేశ్వర రావు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై చర్చకు గాను చంద్రబాబు నాయుడు తెలంగాణ పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి ఆయన విజయవాడ వెళ్లారు. ఈ వివాదంపై ఆయన వైపు నుంచి అధికారిక ప్రకటన ఏదీ రావడం లేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A lady Sunkara Sujatha speaking to Television channels made wild allegations against Telugu Desam Party (TDP) Telangana leader Nama Nageswar Rao.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి