దారుణం: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
హైదరాబాద్: అనుమానాస్పదస్థితిలో ఓ మహిళ చనిపోయింది. ఫలక్‌నుమా ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపిన ప్రకారం సయ్యద్ అహ్మద్, సమీనా బేగం (40) దంపతులు హనస్ నగర్‌లో ఉంటారు.
సమీనా బేగంకు మొదటి భర్త నుంచి విడిపోయింది. వీరికి నలుగురు పిల్లలు. అయితే కొంత కాలం క్రితం హసన్ నగర్‌కు చెందిన సయ్యద్ అహ్మాద్‌ను వివాహం చేసుకుంది.

కాగా అహ్మద్‌కు ఈమె మూడో భార్య. సమీనా బేగం శుక్రవారం ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి దోబిఘాట్ సమీపంలో శవమై కనిపించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications