అక్రమ సంబంధం: ప్రియుడ్ని ఉసిగొల్పి భర్తను చంపించింది

Posted By:
Subscribe to Oneindia Telugu

జుక్కల్: ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకుని అత్యంత దారుణానికి ఒడిగట్టింది. కట్టుకున్న భర్తనే హత్య చేయించింది. ఈ ఘటన మల్లూరులో వెలుగు చూసింది. ప్రియుడిని ఉసిగొలిపి మహిళ భర్తను హత్య చేయించింది

తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని మహిళ బుధవారం రాత్రి తన భర్తను హత్య చేయించింది. నిజాంసాగర్ మండలం మల్లూర్కు చెందిన కుమ్మరి నగేష్ (36) అనే వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్‌‌గా పనిచేస్తున్నాడు.

నగేష్‌కు 16 ఏళ్ల క్రితం బిచ్కుంద మండలం వాజీద్‌నగర్‌క చెందన భారతితో పెళ్లయింది. వారికి కుమారుడు ప్రశాంత్, కూతురు ప్రణతి ఉన్నారు. భారతి ఇంటి వద్దనే ఉంటూ వస్తోంది.

పరిచయం కాస్తా....

పరిచయం కాస్తా....

భారతికి గ్రామానికి చెందిన గూండ్ల దత్తు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వారి ప్రవర్తనపై నగేష్ కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించారు. అయినా వారిలో మార్పు రాలేదు.

ప్రియుడ్ని ఉసిగొల్పింది...

ప్రియుడ్ని ఉసిగొల్పింది...

భర్తను హతమారిస్తే తనకు అడ్డు ఉండదనే ఉద్దేశంతో ప్రియుడు దత్తును ఉసిగొల్పింది. దాంతో దత్తు నగేష్‌తో కలిసి గ్రామ శివారులోని ఊరచెరువు కట్టకు వెళ్లారు. అర్థరాత్రి వరకు ఇద్దరు కలిసి మద్యం సేవించారు. పథకం ప్రకారం దత్తు నగేష్‌ను చెరువు కట్టపై నుంచి తోసేశాడు.

మరోసారి ఇలా....

మరోసారి ఇలా....

కట్ట మెట్లపై నగేష్ పడిపోయాడు. దీంతో ఆయన తలకు, కాళ్లకు దెబ్బ తగిలాయి. స్పృహ తప్పాడు. దీంతో అతన్ని దత్తు నీటిలోకి తోసేశాడు. నగేష్ నీటిలో మునిగి మరణించాడు. గురువారం ఊర చెరవు కట్టపై చెప్పులు ఉండడం, తన భర్త లేడని భారతి చెప్పింది.

గ్రామస్థులు చేరుకుని....

గ్రామస్థులు చేరుకుని....

గ్రామస్థులు ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి నుంచి విషయం అందుకున్న ఎఎస్ఐ గాంధీ గౌడ్ చెరువు కట్ట వద్దకు వచ్చి సమాచారం సేకరించారు. భారతిని, దత్తును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. దత్తు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. మృతుడి తండ్రి వీరప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman Bharathi's lover Dattu killed her husband at Mallur in Nizamasagar mandal of Telangana.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి