ప్రియుడితో ఉండేందుకు భర్తను చంపే ప్లాన్, రూ.5 లక్షల సుఫారీ

హైదరాబాద్: పదమూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లాడిన భర్తను... సుఫారీ ఇచ్చి ప్రియుడితో హత్య చేయించేందుకు ఓ మహిళ పన్నాగం పన్నింది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయాలనుకున్న ఆమె ప్లాన్ బెడిసి కొట్టింది.

జూబ్లీహిల్స్‌లో ఈ నెల 8వ తేదీన జరిగిన సంఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన రాము గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన అంజలిని 13 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

రాము జనరేటర్లు అద్దెకు ఇచ్చే వ్యాపారం చేస్తున్నాడు. ఇతని వద్ద గుడివాడకు చెందిన దుర్గ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అంజలి - దుర్గ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి సంబంధానికి రాము అడ్డుగా ఉన్నాడని.. భర్తను తొలగించాలనుకుంది భార్య అంజలి.

Woman tries to kill husband over extra marital affair

తనకు పాత మిత్రుడైన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఫణీందర్‌ను సంప్రదించింది. అతను మంగళ్ హాట్ సమీపంలోని ఇందిరా నగర్‌కు చెందిన బౌన్సర్ రాకేష్‌ను కలవాలని చెప్పాడు. దీంతో, అంజలి రాకేష్‌ను కలిసింది. తన భర్త అడ్డు తొలగించేందుకు రూ.5 లక్షల సుఫారీ ఇస్తానంది.

రాకేషఖ్ అందుకు అంగీకరించాడు. ఇందుకు అవినాష్ అనే వ్యక్తి సాయం తీసుకున్నాడు. అంతకుముందు క్రితం రెక్కీ నిర్వహించారు. 8వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రాకేష్, అవినాష్‌లు బైక్ పైన గాయత్రీ హిల్స్ చేరుకున్నారు.

తన పిల్లలను తీసుకు వెళ్లేందుకు వెళ్తున్న రామును అడ్డగించారు. రాకేష్ మాట్లాడుతుండగా... ఒక్కసారిగా కత్తితో దాడి చేశారు. అప్రమత్తమైన రాము తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులను విచారించి అసలు విషయాన్ని కూపీలాగారు.

మీర్ చౌక్‌లో దారుణం

మీర్ చౌక్‌లో ఆరేళ్ల బాలిక పైన లైంగిక వేధింపులకు పాల్పడినందుకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. అతని పైన పోస్కో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+