బిడ్డ అనారోగ్యంపై మనస్తాపం, అపార్టుమెంట్ పైనుంచి దూకి తల్లీకూతురు ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాదులోని చందానగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లీ, కూతురు తాము నివసిస్తున్న అపార్టుమెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కూతురు చాలా చిన్న పాప. దీంతో కూతురుతో పాటు తల్లి కిందకు దూకిందని తెలుస్తోంది.
చందానగర్‌లోని బీజేఆర్ ఎన్‌క్లేవ్‌లోని ఓ అపార్టుమెంట్ ఐదో అంతస్తు నుంచి స్వాతి తన కూతురు శాన్వితో పాటు ఆ అఘాయిత్యానికి పాల్పడింది. చిన్నారి శాన్వి ఆరోగ్యం బాగా లేదని తెలుస్తోంది.

కూతురు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆందోళనకు, ఆవేదనకు గురైన స్వాతి తన బిడ్డతో పాటు ఇలా చేసిందని తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.












Click it and Unblock the Notifications