బస్సులో సీటు కోసం చెప్పులతో పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు..
తెలంగాణలో రేవంత్ సర్కార్ తీసుకున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఎంతో మంది స్త్రీలకు ఉపయోగకరంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తీసుకువచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణలో ఓ మంచి పథకంగా అందరి మన్నలను పొందుకుంటుంది.
కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు. పథకం ప్రారంభం మొదటిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తెలంగాణ సర్కార్.. ఆపై క్రమంగా వాటిని అధిగమిస్తూ ఫ్రీ బస్సు స్కీమ్ ను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే అక్కడక్కడ చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.

ఉచిత బస్సు ప్రయాణం కావడంతో ఆర్టీసీ బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. పలు ప్రాంతాలకు ఎన్ని బస్సులు వేసినా సీట్లు సరిపోవడం లేదు. ఈ క్రమంలో సీట్ల కోసం కొంత మంది మహిళలు ఘర్షణలకు దిగుతున్నారు. అంతేకాకుండా విచక్షణ కోల్పోయి పరస్పర దాడులు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు గొడవకి దిగారు. అంతేకాకుండా చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో ఈ ఘటనకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్ లోని హకీంపేటకు చెందిన ఆర్టీసీ బస్సులో ముగ్గురు మహిళలు ఎక్కారు. బొల్లారం స్టాప్ వద్ద ఇద్దరు మహిళల మధ్య సీటు విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో ఓ మహిళ మరో మహిళకు సపోర్ట్ రావడంతో వారి మధ్య ఘర్షణ మరింత పెరిగింది. సీటు తమదంటే తమ దంటూ గొడవకు దిగారు. ఆ మాటల యుద్ధం కాస్త తీవ్రరూం దాల్చి కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ క్రమంలో పరస్పరం బూట్లతో దాడి చేసుకున్నారు.
ఈ సందర్బంగా బస్సు కండక్టర్ వారిని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. కండక్టర్‌ను సైతం పట్టించుకోకుండా దాడి చేసుకున్నారు. అనంతరం చేసేదేమీ లేకపోవడంతో బొల్లారం పోలీస్ స్టేషన్‌లో బస్ కండక్టర్ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలైన కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications