భర్త రెండో పెళ్లి: న్యాయం కోసం భార్య ధర్నా(ఫోటోలు)
కరీంనగర్: తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా చేపట్టిన సంఘటన నగర పంచాయితీ పరిధిలోని దుంపలపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితురాలు అనితి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
దుంపలపల్లి గ్రామానికి చెందిన దొందడి భూమయ్య - బాలవ్వ కుమారుడు రమేశ్‌కు కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామానికి చెందిన పర్స ఎల్లమ్మ - లింగయ్య కూతురు అనితను పెద్దల సమక్షంలో 2007లో పెళ్లి జరిపించారు.
వీరి సంసార జీవితం ఐదేళ్ల పాటు సాఫీగానే సాగింది. పిల్లలు పుట్టడటం లేదని కారణం చేత అనిత - రమేశ్‌ల మధ్య గొడవలు మొదలయ్యాయి. మూడేళ్ల క్రితం అనిత సరిసిల్ల మహిళ పోలీస్ స్టేషన్‌లో రమేశ్‌పై ఫిర్యాదు చేయగా, కేసు సిరిసిల్ల మహిళా కోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి.
అప్పటి నుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో రమేశ్ ఎనిమిది నెలల క్రితం నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం ముల్లుపల్లి గ్రామానికి చెందిన శ్యామలతో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రమేశ్ మొదటి భార్య అనిత తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం రమేశ్ ఇంటి ఎదుట మహిళా చైతన్య వేదిక జిల్లా కమిటీ సభ్యులతో ధర్నా చేపట్టింది.
తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ కూర్చుంది. విషయం తెలుసుకున్న భర్త రమేశ్, అత్తమామలు పరారయ్యారు. ఏఎస్ఐ భూంరెడ్డి గ్రామానికి చేరుకొని బాధితురాలి ఫిర్యాదు మేరకు రమేశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

న్యాయం చేయండంటూ భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా
తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా చేపట్టిన సంఘటన నగర పంచాయితీ పరిధిలోని దుంపలపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితురాలు అనితి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

న్యాయం చేయండంటూ భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా
దుంపలపల్లి గ్రామానికి చెందిన దొందడి భూమయ్య - బాలవ్వ కుమారుడు రమేశ్‌కు కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామానికి చెందిన పర్స ఎల్లమ్మ - లింగయ్య కూతురు అనితను పెద్దల సమక్షంలో 2007లో పెళ్లి జరిపించారు.

న్యాయం చేయండంటూ భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా
వీరి సంసార జీవితం ఐదేళ్ల పాటు సాఫీగానే సాగింది. పిల్లలు పుట్టడటం లేదని కారణం చేత అనిత - రమేశ్‌ల మధ్య గొడవలు మొదలయ్యాయి. మూడేళ్ల క్రితం అనిత సరిసిల్ల మహిళ పోలీస్ స్టేషన్‌లో రమేశ్‌పై ఫిర్యాదు చేయగా, కేసు సిరిసిల్ల మహిళా కోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి.

న్యాయం చేయండంటూ భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా
ఎనిమిది నెలల క్రితం నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం ముల్లుపల్లి గ్రామానికి చెందిన శ్యామలతో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రమేశ్ మొదటి భార్య అనిత తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం రమేశ్ ఇంటి ఎదుట మహిళా చైతన్య వేదిక జిల్లా కమిటీ సభ్యులతో ధర్నా చేపట్టింది.

Click it and Unblock the Notifications