Telangana: విద్యార్థులకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!
తెలంగాణ ఉన్నత పాఠశాలల్లో పని వేళల్లో మార్పు చేయనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను మార్పు చేయనున్నారు. సాధారణంగా ఉన్నత పాఠశాలల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు పని వేళలు ఉంటాయి. ఇప్పుడు ఈ పని వేళలను ఉదయం 9.00 నుండి సాయంత్రం 4.15 వరకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు గతంలో లాగానే ఉదయం 9 గంటలకు ఓపెన్ అయి సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు క్లోజ్ అవుత్యా.ి
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కూడా యథావిధిగా ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలు ఓపెన్ ఉంటాయి. రాఫిక్ కారణాల దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పాఠశాలల్లోని పని వేళల్లో స్వల్ప మార్పులు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతీ పాఠశాలలో విద్యుత్ తో పాటు మరుగు దొడ్లు ఉండేలా చర్యలు తీసుకోనుంది.

అయితే ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ అమలు చేయాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా వరకు టైమ్ కు రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది అయితే పాఠశాల ప్రారంభం అయిన రెండు మూడు గంటలకు వస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
గతంలో ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల అటెండెన్స్ కోసం కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సగంతి తెలిసిందే. బయోమెట్రిక్, ఐరిస్ స్థానంలో ఫేస్ యాప్ విధానాన్ని తీసుకొచ్చారు. నిర్దేశిత సమయంలోగా ఉపాధ్యాయులు ఒక్క నిమిషం ఆలస్యంగా విధులకు హాజరైనా.. ఆ రోజును సెలవుగా పరిగణించేలా దీన్ని రూపొందించారు.












Click it and Unblock the Notifications