వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌రెడ్డి చిచ్చు: మొదటి నుండి చంద్రబాబు ఇలాగే

2014 ఎన్నికల సమయం నుండి తెలంగాణలో టిడిపి నాయకత్వం తీసుకొన్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పార్టీ నుండి కీలకమైన నేతలు బయటకు వెళ్ళడానికి ఈ నిర్ణయాలు కూడ కారణంగా మారాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:2014 ఎన్నికల సమయం నుండి తెలంగాణలో టిడిపి నాయకత్వం తీసుకొన్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పార్టీ నుండి కీలకమైన నేతలు బయటకు వెళ్ళడానికి ఈ నిర్ణయాలు కూడ కారణంగా మారాయి.

Recommended Video

రేవంత్‌రెడ్డిని పదవుల నుండి తొలగిస్తున్నారా?TDLP

చిచ్చుపై బాబు ఆరా: కత్తులు దూసుకొంటున్న రమణ, రేవంత్‌రెడ్డిచిచ్చుపై బాబు ఆరా: కత్తులు దూసుకొంటున్న రమణ, రేవంత్‌రెడ్డి

2014 ఎన్నికల సమయంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్రంపైనే కేంద్రీకరించారు. ఏపీ రాష్ట్రంలో అధికారంలో వచ్చేందుకే చంద్రబాబునాయుడు ప్రాధాన్యత ఇచ్చారు.తెలంగాణపై అంతగా శ్రద్ద చూపలేదని టిడిపి నేతల భావన.

రేవంత్‌రెడ్డి ఎపిసోడ్: టిడిఎల్‌పిలో ఏం జరుగుతోంది, పార్టీ ఎందుకు వీడుతున్నారు?రేవంత్‌రెడ్డి ఎపిసోడ్: టిడిఎల్‌పిలో ఏం జరుగుతోంది, పార్టీ ఎందుకు వీడుతున్నారు?

2014 ఎన్నికల సమయంలో తెలంగాణలో టిక్కెట్ల కేటాయింపులో చంద్రబాబునాయుడు ఇంకా శ్రద్ద కనబరిస్తే పార్టీకి ఇంత నష్టం వాటిల్లకపోయేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

ముదురుతున్న వివాదం: తగ్గని రేవంత్‌రెడ్డిముదురుతున్న వివాదం: తగ్గని రేవంత్‌రెడ్డి

మరోవైపు బిజెపితో పొత్తు కారణంగా కూడ టిడిపిని తీవ్రంగా నష్టపర్చిందనే అభిప్రాయంతో టిడిపి నేతలు ఉన్నారు.ఈ పొత్తు కారణంగా కొందరు ముఖ్యమైన నేతలకు టిక్కెట్లు కోరుకొన్న స్థానాల్లో దక్కకుండాపోయాయి.

రేవంత్‌కు షాక్: 'టిడిఎల్పీ, పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆదేశం' రేవంత్‌కు షాక్: 'టిడిఎల్పీ, పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆదేశం'

 2014 ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు నుండి ఇలానే

2014 ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు నుండి ఇలానే

2014 ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో చంద్రబాబునాయుడు తీసుకొన్న కొన్ని నిర్ణయాలు పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపతున్నాయి. ఆ రోజున టిక్కెట్ల కేటాయింపులో జాగ్రత్తలు తీసుకొంటే ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి బయటపడేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే రాజకీయ అవసరాల రీత్యా చంద్రబాబునాయుడు అనివార్య పరిస్థితుల్లోనే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

పాలేరు టిక్కెట్టు తుమ్మలకు ఇస్తే పరిస్థితి మరోలా ఉండేదా?

పాలేరు టిక్కెట్టు తుమ్మలకు ఇస్తే పరిస్థితి మరోలా ఉండేదా?

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి కాకుండా పాలేరు అసెంబ్లీ స్థానం నుండి టిక్కెట్టు కావాలని తుమ్మల నాగేశ్వర్‌రావు చంద్రబాబునాయుడును కోరారు. అయితే ఖమ్మం జిల్లాలో నామా నాగేశ్వర్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు వర్గాల మధ్య సఖ్యత లేదు. దీంతో తుమ్మలకు పాలేరు టిక్కెట్టు దక్కలేదు. ఖమ్మం నుండి బాలసాని లక్ష్మీనారాయణను బరిలో దింపి, పాలేరు నుండి తుమ్మల నాగేశ్వర్‌రావు పోటీ చేయాలని భావించారు. ఖమ్మం ఎంపీ స్థానం నుండి నామా నాగేశ్వర్‌రావు బరిలో దిగేవారు. అలా జరిగి ఉంటే ఈ మూడు స్థానాలను టిడిపి కైవసం చేసుకోవడంతో పాటు ఖమ్మం జిల్లాలో మరికొన్ని స్థానాల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించేవారని పార్టీ నేతల భావన. అయితే నామా నాగేశ్వర్‌రావు వర్గానికి చెందిన స్వర్ణకుమారి కోసం పాలేరు టిక్కెట్టును తుమ్మలకు ఇవ్వలేదు. ఓటమి పాలైన తర్వాత తుమ్మల నాగేశ్వర్‌రావు టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణంతో జరిగిన ఉపఎన్నికల్లో టిఆర్ఎస్‌ అభ్యర్థిగా పాలేరు నుండి పోటీ చేసి విజయం సాధించారు.

 రేవంత్‌కు దక్కని మల్కాజిగిరి టిక్కెట్టు

రేవంత్‌కు దక్కని మల్కాజిగిరి టిక్కెట్టు

2014 ఎన్నికల సమయంలో టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్టును కోరుకొన్నారు. కానీ, ఈ టిక్కెట్టును మల్లారెడ్డికి చంద్రబాబునాయుడు కేటాయించారు. ఈ టిక్కెట్టు కోసం రేవంత్‌రెడ్డి చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. ఆనాడు రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడుగా ఉణ్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో రేవంత్‌రెడ్డి చంద్రబాబునాయుడు నివాసంలో తీవ్రంగా గొడవపడ్డారు.మల్కాజిగిరి ఎంపీ స్థానంలో రేవంత్‌ పోటీ చేస్తే తన సోదరుడిని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దింపాలని రేవంత్ ఆలోచన. అయితే చంద్రబాబునాయుడు సూచన మేరకు రేవంత్‌రెడ్డి కొడంగల్‌ నుండి పోటీ చేయాల్సి వచ్చింది.

 బిజెపితో పొత్తుతో టిక్కెట్ల గల్లంతు

బిజెపితో పొత్తుతో టిక్కెట్ల గల్లంతు

బిజెపితో పొత్తు కారణంగా టిడిపి బలంగా అసెంబ్లీ సీట్లను బిజెపి కోరుకొంది. ఈ సీట్లను పొత్తులో భాగంగా బిజెపికి కట్టబెట్టాల్సిన అనివార్య పరిస్థితులు టిడిపికి నెలకొన్నాయి. మల్కాజిగిరి అసెంబ్లీ టిక్కెట్టును బిజెపి పట్టుబట్టింది. ఈ స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీ చేశారు. అయితే ఈ స్థానంలో మైనంపల్లి హన్మంతరావు పోటీ చేయాలని భావించారు. కానీ, టిడిపి టిక్కెట్టు దక్కకపోవడంతో మైనంపల్లి హన్మంతరావు టిఆర్ఎస్‌లో చేరారు. మల్కాజిగిరి ఎంపీ స్థానం నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.బిజెపితో పొత్తు కారణంగా కొన్ని సీట్లలో రెండు పార్టీలు రాజీతో వ్యవహరిస్తే మరికొన్ని సీట్లు టిడిపి ఖాతాలో పడేవి.

దేవేందర్‌గౌడ్ తనయుడికి దక్కని ఉప్పల్ సీటు

దేవేందర్‌గౌడ్ తనయుడికి దక్కని ఉప్పల్ సీటు

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నుండి పోటీ చేసేందుకు టిడిపి సీనియర్ నాయకుడు దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ ప్లాన్ చేసుకొన్నారు. అయితే బిజెపితో పొత్తు కారణంగా ఉప్పల్ సీటును ఆ పార్టీకి కేటాయించాల్సి వచ్చింది. ఉప్పల్ స్థానం నుండి బిజెపి అభ్యర్థిగా ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్‌రావు బరిలోకి దిగి విజయం సాధించారు. చేవేళ్ళ పార్లమెంట్ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన వీరేందర్‌గౌడ్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

 ఆర్..కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై నేతల వ్యతిరేకత

ఆర్..కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై నేతల వ్యతిరేకత

2014 ఎన్నికల సమయంలో తెలంగాణలో టిడిపి అధికారంలోకి వస్తే ఆర్. కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా చంద్రబాబునాయుడు ప్రకటించారు. పార్టీలో చాలా మంది బిసి నాయకులు ఉన్నప్పటికీ కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై కొందరు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆర్.కృష్ణయ్యతో పార్టీకి ప్రయోజనం కలుగుతోందని భావించారు. కానీ, పార్టీకి ఆశించిన ప్రయోజనం మాత్రం దక్కలేదు.

English summary
Tdp leadership taken wrong steps from 2014 assembly elections.It reflects on Tdp now. TDP leaders urged to Chandrababu Naidu take necessary steps for strenthen party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X