ఈటల రాజేందర్‌కు కేంద్రమంత్రి స్థాయిలో భద్రత పెంచిన కేంద్రం, ధర్మపురి అరవింద్‌కు కూడా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇద్దరు భారతీయ జనతా పార్టీ కీలక నేతలకు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్‌కు వరుసగా వై ప్లస్(Y+), వై(Y) కేటగిరి భద్రతను కల్పిస్తున్నట్లుగా సోమవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈటల రాజేందర్‌కు వై ప్లస్ కేటగిరీలో భద్రత కల్పించగా.. ధర్మపురి అరవింద్‌కు వై కేటగిరీలో భద్రత కేటాయించారు. భద్రతతోపాటు ఈ ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా కేటాయించారు. ఇటీవలే ఈటల రాజేందర్‌కు బీజేపీ కీలక పదవి కట్టబెట్టగా.. తాజాగా భద్రత పెంచుతూ నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 Etala Rajender and Dharmapuri Arvind

అయితే, ఇటీల తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఈటల రాజేందర్ భార్య జమున మీడియా ముందుకు వచ్చి చెప్పారు. మరోవైపు, ఈటల రాజేందర్ కూడా తనకు ప్రాణహాని ఉందని.. గుర్తు తెలియని వాహనాలు తనను వెంబడిస్తున్నట్లు వెల్లడించారు. భద్రత కల్పించాలంటూ కోరినా.. తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదన్నారు ఈటల.

కాగా, గత కాలం క్రితం ఎంపీ అరవింద్ ఇంటిపైనా దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈటలతోపాటు ఎంపీ అరవింద్ ‌కు కూడా కేంద్రం భద్రతను పెంచడం గమనార్హం. సోమవారం ఇద్దరు నాయకుల ఇళ్లకు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించనున్నారు. భద్రతను పెంచనున్నారు.

వై కేటగిరీలో ఉన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు ఒక మాండోతోపాటు 8 నుంచి 11 మందితో సెక్యూరిటీ ఉంటుంది. ఇక, వై ప్లస్ కేటగిరీలో ఉన్న ఈటల రాజేందర్‌కు ఇద్దరు కమాండోలతోపాటు 11 మంది సిబ్బంది భద్రతగా ఉంటారు. కేంద్రస్థాయిలో ఈటలకు భద్రత కల్పించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+