బ్రహ్మోత్సవం.. యాదాద్రీశుని దివ్యోత్సవం.. ఆలయ పునఃప్రారంభం తర్వాత తొలిసారి; అంకురార్పణతో నేటినుండి ప్రారంభం!!
తెలంగాణా తిరుమలగా ప్రసిద్ధి పొందిన, తెలంగాణకే తలమానికమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదాద్రి క్షేత్రం. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుండి మార్చి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
తెలంగాణా తిరుమలగా ప్రసిద్ధి పొందిన, తెలంగాణకే తలమానికమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదాద్రి క్షేత్రం. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుండి మార్చి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాలకు కాంతులీనుతున్న యాదాద్రి ...
మొత్తం 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు, అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. యాదాద్రి ఆలయ పునః ప్రారంభం తర్వాత స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగడం ఇదే తొలిసారి. దీంతో అధికారులు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఘనమైన ఏర్పాట్లను చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిబ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగాఅలంకరించారు. పూలతో సుందరంగా తీర్చిదిద్దారు.

నేడు అంకురార్పణతో బ్రహ్మోత్సవాల ఆరంభం
నేడుబ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ చేసి, స్వస్తివచనం, రక్షా బంధనం నిర్వహిస్తున్నారు . రేపు దేవతాహ్వానం పలుకుతారు. పదుల సంఖ్యలో రుత్విక్కులకు ఆహ్వానాలు పంపారు. ఆలయంలో హోమగుండం సిద్ధం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చలువపందిళ్ళు వేశారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

పాంచరాత్రాగమ రీతిలో బ్రహ్మోత్సవాలు
11 రోజులపాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలను పాంచరాత్రాగమ రీతిలో నిర్వహించాలని నిర్ణయించారు. స్వామివారి యాదాద్రి కొండపై మాడవీధులు, విష్ణు పుష్కరిణి, సప్తరాజ గోపురాలను విద్యుత్ దీపాలంకరణతో చక్కగా తీర్చిదిద్దారు. ఉత్తరమాడ వీధిలోని తిరు కళ్యాణ మండపాలను ప్రత్యేకంగా అలంకరించారు.ఓం నమో లక్ష్మీనరసింహాయఅంటూభక్తుల జయజయధ్వానాలతోఅంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాల నిర్వహణజరగనుంది.

యాదాద్రికి చేరుకున్న అఖండ జ్యోతి యాత్ర
ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్ లో మొదలైన అఖండ జ్యోతి యాత్ర యాదాద్రి కి చేరుకున్న విషయం తెలిసిందే. నేడు స్వస్తి పుణ్యాహవచనంతో ప్రారంభమై బ్రహ్మోత్సవాలు వివిధ వాహన సేవలతో, విశేష పూజలతో చివరగా అష్టోత్తర శతఘటాభిషేక పూజ మహోత్సవాలతో మార్చి మూడవ తేదీన ముగియనున్నాయి. ఇక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 23వ తేదీ నుండి నుండి మార్చి 1వ తేదీ వరకు వారం రోజుల పాటు అలంకార, వాహన సేవలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications