దేశంలోనే యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం రికార్డు.. విశేషాలివే!
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దబడిన యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మహా కుంభాభిషేక సంరక్షణ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ నెల 23వ తేదీన దేవస్థానంలో ఇటీవల కాలంలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహా కుంభాభిషేకాన్ని నిర్వహించనున్నారు.
యాదగిరి గుట్ట మహా కుంభాభిషేకానికి కేసీఆర్ కు ఆహ్వానం
ఈ కార్యక్రమానికి యాదగిరిగుట్ట దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అత్యంత సుందరంగా తీర్చి దిద్దిన నాటి సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించారు. ఫిబ్రవరి 21వ తేదీన యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన పూజారి, ఆలయ నిర్వహణ అధికారులతో కూడిన బృందం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఆలయ విమాన గోపురానికి చాలా విశిష్టత
ఇదే సమయంలో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సైతం హాజరు కావాల్సిందిగా కెసిఆర్ ను కోరారు. ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభాభిషేక సంరక్షణ మహోత్సవాలలో కీలక ఘట్టమైన స్వర్ణ విమాన గోపురానికి మహా కుంభాభిషేకం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఆలయ విమాన గోపురానికి ఉన్న విశేషమే దానికి కారణం.
స్వర్ణ విమానం గోపురం పనులకు ఎంత బంగారం వాడారంటే
స్వర్ణ విమాన గోపురాన్ని ఏర్పాటు చేయడానికి 2024లో స్వర్ణ తాపడం పనులను ప్రారంభించారు. గోపురానికి స్వర్ణ తాపడం పనులు చేసేందుకు మొత్తం 68 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. ఇక స్వర్ణ విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులు కాగా గోపురం వైశాల్యం 10759 చదరపు అడుగులు.
దేశంలోనే అత్యంత్ ఎత్తయిన గోపురం ఇదే
ఫిబ్రవరి 18 2025న తాపడం కవచాల బిగింపు పనులు పూర్తయ్యాయి. అయితే ఈ బిగింపు పనులకు ఆయన మొత్తం ఖర్చు 5.10 కోట్లు. ఇక రాగి రేకులకు మొత్తం 12 లక్షల రూపాయలు ఖర్చు కాగా, సుమారు ఈ స్వర్ణ తాపడం పనులకు 70 కోట్ల వరకు ఖర్చయినట్టుగా అంచనా. అయితే ఈ స్వర్ణ విమాన గోపురం వంటి అత్యంత ఎత్తైన గోపురం ఒక్క యాదగిరిగుట్టలో తప్ప మరి ఎక్కడా లేదు. దేశంలోనే అత్యంత ఎత్తైన మొట్టమొదటి స్వర్ణ విమాన గోపురంగా ఇది రికార్డుకి ఎక్కడం గమనార్హం.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications