కాంగ్రెస్‌కు లైఫ్ ఇచ్చిన సౌత్.. భారీ స్కెచ్

Congress: దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నాటికి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు సమాయాత్తమౌతోన్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఇండియా కూటమి.. ఇప్పటి నుంచి కసరత్తు మొదలు పెట్టాయి.

ఇటీవలే ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరం మినహాయిస్తే- మూడు చోట్ల బీజేపీ, ఒక దాంట్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి ఎన్నికల మేనిఫెస్టో కీలకంగా మారిందనేది బహిరంగ రహస్యం.

Year ender 2023: Congress wins Karnataka and Telangana

ఇదే దూకుడును అటు లోక్‌సభ, ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది. ఏపీని మినహాయిస్తే.. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళల్లో గల లోక్‌సభ నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.

నిజానికి- ఈ ఏడాది కాంగ్రెస్‌కు జీవం పోసిందే దక్షిణాది రాష్ట్రాలు. కర్ణాటక, తెలంగాణల్లో ఈ పార్టీ ఘన విజయం సాధించింది. అధికార పార్టీలను ఓడించి మరీ ప్రభుత్వాన్నిఏర్పాటు చేయగలిగింది. తొలుత కర్ణాటక, అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పాగా వేయగలిగింది. ఈ రెండింటితో పాటు జరిగిన ఉత్తరాది రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోయింది.

దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తోన్నారనే విషయం ఈ ఎన్నికలతో మరోసారి ప్రూవ్ అయింది. కేరళలో అధికారంలో లేనప్పటికీ.. ఆ రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్‌ పార్టీవే. తమిళనాడులో డీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని, తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితిని మట్టికరిపించి మరీ అధికారాన్ని అందుకోగలిగింది.

Year ender 2023: Congress wins Karnataka and Telangana

ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుస్తుందనే అంచనాలూ లేవు. 2014, 2019 ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగు కూడా పెట్టలేకపోయింది. ఆ లోటును ఈ దఫా భర్తీ చేసుకోవాలని భావిస్తోంది గానీ.. అది సాధ్యం అయ్యేలా కనిపించట్లేదు. ఏపీ కాంగ్రెస్‌లో ఎలాంటి ఎన్నికల సందడీ కనిపించట్లేదు.

దక్షిణాది రాష్ట్రాలు మత రాజకీయాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటాయనే విషయం ఈ ఎన్నికలతో రుజువైంది. చేతిలో ఉన్న ఒక్క రాష్ట్రం కర్ణాటకనూ కోల్పోయింది. ఇక ముందు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ నిలదొక్కుకుంటుందనేది అనుమానమే. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆశించిన స్థాయిలో సీట్లు దక్కించుకోలేదనే అంచనాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+