Janagam: అసువులుబాసిన యువరైతు.. కరెంట్ షాక్ తో మృతి..
కరెంట్ షాక్ తో యువ రైతు మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది.
చాలా మందికి రైతు అంటే చిన్న చూపు.. కానీ ఆ రైతే లేకుంటే ఎంతటి సంపన్నుడికైనా తినడానికి తిండి దొరగదు. అడుక్కు తినే బిచ్చగాడి నుంచి లక్షల కోట్లు ఉన్న ధనవంతుడి వరకు అన్నదాత పండించిన పంటే దిక్కు.. కానీ ఈ అన్నదాత మాత్రం ఎన్నో కష్టలు పడుతున్నాడు. వ్యసాయం చేస్తూ ప్రాణాలు విడుస్తున్నాడు. తాజాగా ఓ యువరైతు వ్యవసాయ పనులు చేస్తూ కరెంట్ షాక్ తో మృతి చెందాడు.
జనగామ జిల్లా అడవికేశవాపూరం గ్రామానికి చెందిన గూడూరు యాదయ్య, సుశీల దంపతుల చిన్న కొడుకు గూడురు రాజు వ్యవసాయం చేస్తున్నాడు. ఈ యాసంగి 2 ఎకరాల్లో వరి సాగు చేశాడు. అయితే ఎండ కాలం కావడం నీటి లభ్యత తగ్గిపోవడంతో వరి ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పొట్టదశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు రాజు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.

వీరి పొలానికి దగ్గరలోనే బొమ్మకూరు రిజర్వాయర్ ఉంది. దీని చుట్టపక్కల ఉన్న రైతులు ఇందులో మోటార్లు పెట్టుకుని పంటకు నీరు పెడుతున్నారు. అయితే దేవాదుల నుంచి నీటి విడుదల లేకపోవడంతో రిజర్వాయర్ లో నీరు అడుగట్చింది. దీంతో రైతులు పదే పదే రిజర్వాయర్ లోకి దిగి పైపులు మరింత కిందికి దించుతూ పొలాన్ని పారించుకుంటున్నారు.
సోమవారం మధ్యాహ్నం రాజు పొలానికి నీరు పెట్టడానికి వెళ్లాడు. అయితే నీరు సారిగా రాకపోవడంతో అతను రిజర్వాయర్ లోకి దిగాడు. ఫుట్వాల్ బుడ్డీలను జరుపుతుండగా.. రాజుకు కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజుకు భార్యతోపాటు కూతురు హన్సిక, కుమారుడు ప్రమోద్ ఉన్నారు.












Click it and Unblock the Notifications