షాకింగ్ రీజన్ చెప్పి.. అర్దరాత్రి అక్క ముఖంపై సలసలకాగే వేడినూనె పోసిన చెల్లెలు!!
కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ చెల్లెలు విచక్షణా రహితంగా అక్క పైన దాడి చేసింది. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న అక్క ముఖం పైన సలసల కాగే వేడి నూనె పోసింది ఓ చెల్లెలు. రక్త సంబంధాలకు, మానవ అనుబంధాలకు అర్థం లేకుండా చేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే

అక్క ముఖంపై వేడి నూనె పోసిన చెల్లెలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న అక్క చాందిని పై చెల్లెలు నాగూరిభీ వేడి నూనెతో దాడి చేసింది. అక్కపై అక్కసు తట్టుకోలేక అక్క ముఖంపై వేడి నూనె పోసింది. మంగళవారం రోజు అర్ధరాత్రి అక్క ముఖంపై సలసల కాగే వేడి నూనెను పోసి తన అక్కసు వెళ్ళగక్కింది . దీంతో అక్క చాందిని ముఖం సగ భాగం కాలిపోయింది. ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే జరిగిన దాడిలో వేడి నూనె ముఖం మీద పడడంతో బాధ భరించలేక చాందిని అరుపులు, కేకలతో లేచి కూర్చుంది. చెల్లెలే ఈ పని చేసిందని తెలిసి నిర్ఘాంతపోయింది.

తాను సన్నిహితంగా ఉండే వ్యక్తితో అక్క క్లోజ్ గా ఉండటమే కారణం
వెంటనే నిద్ర లేచిన కుటుంబ సభ్యులు అక్క చాందినీ ముఖంపై చెల్లెలు నాగూరిభీ వేడి నూనె పోసిందని చూసి షాక్ తిన్నారు. అసలు చెల్లెలు అక్క ముఖంపై వేడి నూనె పోవడానికి గల కారణం విన్నవారు మరింత అవాక్కయ్యారు. తాను సన్నిహితంగా ఉంటున్న వ్యక్తితో తన అక్క చాందిని కూడా క్లోజ్ గా ఉంటుందని గమనించిన చెల్లెలు దానిని భరించలేకపోయింది. అందుకే అక్క చాందినీ ముఖం పై సలసల కాగే వేడి నూనె పోసి మానవత్వం లేకుండా ప్రవర్తించింది.

అక్క పరిస్థితి విషమం... చెల్లెలిపై కుటుంబ సభ్యుల ఆగ్రహం
చెల్లెలు చేసిన వేడి నూనె దాడిలో గాయపడిన అక్క చాందిని ముఖం సగం కాలిపోయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది . ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సొంత అక్క, తన రక్త సంబంధం అన్న విషయాన్ని కూడా మరచి ఎవరో వ్యక్తి కోసం మానవత్వం లేకుండా ప్రవర్తించిన చెల్లెలు తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video


చెల్లెలిపై చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి
మానవత్వాన్ని మరిచి రాక్షసత్వం తో ప్రవర్తించిన చెల్లెలు పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎటువంటి కోపం అయినా, సందర్భం ఏదైనా కాస్త సహనంతో ఆలోచించి మాట్లాడి పరిష్కరించుకోవాల్సిన సమస్యలని, భూతద్దంలో చూసి ప్రాణాలు తీసే దాకా వెళ్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు మారాలని, మానవ సంబంధాలు, రక్త సంబంధాలు దృఢంగా ఉండాలని ఎంతమంది ఆకాంక్షిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు మానవ సంబంధాలను వెక్కిరిస్తూనే ఉన్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications