ఆ పరిచయం ఎంతపనిచేసింది?: 'వాట్సాప్' వల్లే.., ఆమెపై అత్యాచారం..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ముక్కూ ముఖం తెలియని వ్యక్తితో వాట్సాప్ పరిచయమే ఆమె కొంపముంచింది. అపరిచిత వ్యక్తి నుంచి ఓరోజు మెసేజ్ రావడంతో.. ఆమె రిప్లై ఇవ్వడం.. ఆ తర్వాత అతను ఆమెను మాటల్లోకి దింపడం జరిగిపోయాయి. వ్యవహారం మరింత ముదిరి అతను నేరుగా ఆమె ఇంటికే వచ్చాడు. ఆపై ఆమెపై అత్యాచారం జరిపాడు.

 అంతా వాట్సాప్ వల్లే..:

అంతా వాట్సాప్ వల్లే..:

హైదరాబాద్‌లోని ఓల్డ్‌ మలక్‌పేటకు చెందిన పందుల పవన్‌కుమార్‌ డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఒకరోజు తన మొబైల్‌ నుంచి తోచిన నంబర్‌కు వాట్సాప్ ద్వారా హాయ్ అంటూ మెసేజ్ పెట్టాడు. అవతలి వ్యక్తి మహిళ అని తెలియడంతో అతను మరింత రెచ్చిపోయాడు.

ట్రాప్ చేయాలనుకున్నాడు..:

ట్రాప్ చేయాలనుకున్నాడు..:

తొలుత ఆ మహిళ ఎవరు మీరు? అని ప్రశ్నించగా.. పవన్ 'సారీ' అని బదులిచ్చాడు. అనుకోకుండా మెసేజ్ వచ్చిందని సంజాయిషీ ఇచ్చుకున్నాడు. కానీ అవతలి వ్యక్తి మహిళ అని తేలడంతో అతని ఆలోచనలు దారి తప్పాయి. చివరకు ఆమెను ట్రాప్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

మెల్లిగా మాటలు కలిపాడు..:

మెల్లిగా మాటలు కలిపాడు..:

మరుసటి రోజు మళ్లీ 'గుడ్ మార్నింగ్' అంటూ ఆమెకు మెసేజ్ చేశాడు పవన్. ఈసారి ఆమె కూడా గుడ్ మార్నింగ్ అంటూ బదులివ్వడంతో ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. మెల్లిగా ఆమె గురించి పూర్తి వివరాలు సంపాదించాడు పవన్.

 నేరుగా ఇంటికెళ్లి రేప్ చేశాడు..:

నేరుగా ఇంటికెళ్లి రేప్ చేశాడు..:

ఓరోజు సదరు మహిళ భర్త ఇంట్లో లేడని చాటింగ్ ద్వారా తెలుసుకున్నాడు. ఆపై నేరుగా బాలాపూర్ లోని ఆమె నివాసానికి వెళ్లాడు. అక్కడ ఆమెను భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటినుంచి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం జరుపుతూ వస్తున్నాడు.

ఇలా వెలుగులోకి:

ఇలా వెలుగులోకి:

పవన్ వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతుండటం ఆమెను కలచివేసింది. ఇటీవల రూ..55వేల నగదుతో పాటు 5గ్రాముల బంగారు చెవి దిద్దులను కూడా అతను తీసుకెళ్లాడు. ఇక అతని వేధింపులను భరించలేక.. సదరు మహిళ విషయం మొత్తం భర్తకు చెప్పింది.

ఇద్దరూ మీర్ పేట పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు పవన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A married woman was allegedly forced to enter into the physical relationship with a youth who blackmailed her

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి