ప్రేమ తిరస్కరణ: సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడు ఆత్మహత్య

మహబూబ్‌నగర్: ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం జోగులాంబ గద్వాల జిల్లాలో వడ్డేపల్లి మండలం జక్కేరెడ్డి పల్లిలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన మహేందర్‌ రెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ యువతి నిరాకరించడంతో పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మహేందర్‌ ఓ పురుగుల మందుల కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.

 A youth allegedly committed suicide in gadwal district

రోడ్డు ప్రమాదంలో టీవీ ఛానెల్ రిపోర్టర్ మృతి

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొడకండ్ల సమీపంలో రాజీవ్‌ రహదారిపై శుక్రవారం ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఉమ్మడి మెదక్‌ జిల్లా వీ6 ఛానెల్‌ రిపోర్టర్‌ ప్రసన్నకుమార్‌(35) మృతిచెందారు.

తన సోదరుడి పెళ్లి శుభలేఖను బంధువులకు అందించి తిరుగు ప్రయాణంలో కరీంనగర్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ప్రసన్నకుమార్‌ను కుకునూరుపల్లి పోలీసులు గజ్వేల్‌లోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+