ప్రేమించలేదని బీటెక్ విద్యార్థినిని పొడిచి, ఆత్మహత్య

 A youth allegedly stabbed engineering girl
హైదరాబాద్: తనను ప్రేమించలేదనే కోపంతో ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత అతను కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన మైలార్‌దేవ్ పల్లి-బండ్లగూడ చౌరస్తాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం రవళి అనే ఇంజినీరింగ్ విద్యార్థిని బండ్లగూడలోని అరోరా కళాశాలకు బయల్దేరింది. కాపు కాసిన నిందిత యువకుడు ప్రదీప్ ఆమెను కళాశాల ప్రవేశ ద్వారం వద్ద కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చాడు. దీంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది.

ఆ తర్వాత అక్కడికి చేరుకున్న కళాశాల విద్యార్థులు, స్టాఫ్ నిందితుడ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అతడు వారిపై దాడికి యత్నించి తనతోపాటు తెచ్చుకున్న విషాన్ని తాగేశాడు. వెంటనే వీరిద్దర్నీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నిందిత యువకుడు ప్రదీప్‌ను డిఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ ప్రదీప్ ఆస్పత్రిలో మరణించాడు.

ప్రస్తుతం రవళి పరిస్థితి కొంత నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు కళాశాల సిబ్బంది చెప్పారు. ప్రదీప్ గుంటూరు జిల్లా కారంచేడుకు చెందిన వాడిగా గుర్తించారు. అతడు గత కొంతకాలంగా రాంనగర్‌లో నివాసముంటున్న రవళిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో రవళి కుటుంబసభ్యులు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు కనిపించని ప్రదీప్.. సోమవారం ఉదయం బస్సు దిగి కళాశాలకు చేరుకుంటున్న రవళిపై కత్తితో దాడి చేశాడు. గత కొంతకాలంగా ప్రదీప్ కూడా రాంనగర్‌లోనే ఉంటున్నట్లు తెలిసింది.

ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మహిళ సజీవ దహనం

మహబూబ్‌నగర్‌: నగరంలోని బ్రాహ్మణవాడకు చెందిన విజయలక్ష్మి(65) ఆదివారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని సజీవ దహనమైంది. విజయలక్ష్మి సోదరి లక్ష్మీదేవితో కలిసి నివాసం ఉంటోంది. ఆదివారం సోదరి బయటకు వెళ్లింది. కొద్ది రోజుల కిందట నల్లా గుంతలో పడి విజయలక్ష్మి కాలుకు దెబ్బతగిలి వాచింది. దాంతో మంచంపై కూర్చుని పొయ్యి వెలిగించి కాలును కాపుకుంటుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి.

కాలు గాయంతో బాధపడుతున్న విజయలక్ష్మి వెంటనే లేవలేకపోయింది. గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే దట్టమైన పొగలు వ్యాపించడంతో వెళ్లలేక పోయారు. అగ్నిమాపక వాహనం సాయంతో మంటలను ఆర్పారు. అప్పటికే విజయలక్ష్మి దహనమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+