భయమా, పరువా: విక్రమ్‌ గౌడ్‌కు తెలుసు కానీ, మూడో వ్యక్తి ఎవరు?

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పైన కాల్పుల కేసు మిస్టరీ పూర్తిగా వీడలేదు. ఈ కాల్పులపై విచారణ కొనసాగుతోంది.

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పైన కాల్పుల కేసు మిస్టరీ పూర్తిగా వీడలేదు. ఈ కాల్పులపై విచారణ కొనసాగుతోంది.

విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నం నాటకం ఆడారా, డ్రగ్ కేసులో ఉన్నందున ఆత్మహత్యాయత్నం చేశారా, తండ్రి కొంతకాలంగా దూరం పెట్టడంతో ఇలా చేశాడా అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. మరోవైపు అపోలో ఆసుపత్రిలో విక్రమ్ గౌడ్ చికిత్స పొందుతున్నారు.

వికమ్, షిఫాలీ వాంగ్మూలం

వికమ్, షిఫాలీ వాంగ్మూలం

ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ పెట్టుకొని వచ్చి కాల్పులు జరిపి పారిపోయారని విక్రమ్ సతీమణి షిఫాలి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారని తెలుస్తోంది. అలాగే తనకు అప్పు ఇచ్చిన వారు ఆసుపత్రి చుట్టూ కూడా తిరుగుతున్నారని విక్రమ్ గౌడ్ పోలీసులకు చెప్పాడని సమాచారం. నిందితుల కోసం పద పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

ఎవరో తెలుసునని విక్రమ్.. కానీ

ఎవరో తెలుసునని విక్రమ్.. కానీ

తనపై కాల్పులు జరిపిన వ్యక్తులెవరో తెలుసునని, బయటకు వచ్చాక వారి సంగతి తేలలుస్తానని విక్రమ్ గౌడ్ సన్నిహితుల వద్ద చెప్పారని ప్రచారం సాగుతోంది. మరోవైపు, ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారని, హెల్మెట్‌లు ధరించి ఇంట్లోకి వచ్చి తనపై కాల్పులు జరిపి పారిపోయారని శనివారం పోలీసుల విచారణలో చెప్పాడని తెలుస్తోంది. తనను కాల్చిందెవరో అతనికి తెలుసునని, కానీ పోలీసులకు చెప్పేందుకు ఎందుకు వెనుకాడుతున్నాడనే చర్చ సాగుతోంది. దుండగులు తనపై ప్రతీకారం తీర్చుకుంటారని భయమా.. ఇంటి గుట్టు బయటపడితే పరువుపోతుందనే సంకోచమా అనే చర్చ సాగుతోంది.

ముఖేష్ ఎందుకు రాలేదు

ముఖేష్ ఎందుకు రాలేదు

కుమారుడు ఆసుపత్రిలో ఉన్నా పరామర్శించేందుకు శనివారం వరకు ముఖేష్ గౌడ్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ అయిన వైద్య ఖర్చులు చెల్లించమంటూ రూ.2.25లక్షల బిల్లులను ఆసుపత్రి వర్గాలు ముఖేష్ గౌడ్‌కు పంపినట్టుగా తెలుస్తోంది.

తండ్రితో విభేదాలున్నాయా?

తండ్రితో విభేదాలున్నాయా?

విక్రమ్, షిఫాలీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సినీ, రాజకీయాల్లో ఉన్న పరిచయాలున్నాయి. విక్రమ్ పలు కంపెనీల్లో వ్యాపార భాగస్వామిగా చేరారు. పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నాడనే ఉద్దేశంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. తండ్రితో రెండేళ్లుగా విభేదాలు తలెత్తాయి. వ్యాపారాల్లో నష్టపోవటం, అప్పులు తీర్చే మార్గం లేకపోవటంతో విక్రమ్‌ కొద్దిరోజులుగా ఇబ్బందిపడుతున్నట్లుగా తెలుస్తోంది. రూ.30 కోట్లకు పైగా అప్పు ఉందని, దాదాపు ఏడాది క్రితం తండ్రికి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.

షిఫాలీ ఎవరికి ఫోన్ చేసింది, కెమెరాలు ఎందుకు పని చేయట్లేదు

షిఫాలీ ఎవరికి ఫోన్ చేసింది, కెమెరాలు ఎందుకు పని చేయట్లేదు

కాల్పుల సమయంలో వాచ్‌మెన్‌, డ్రైవర్‌, తాను మాత్రమే ఉన్నామని భార్య షిఫాలి పేర్కొంది. ఘటన జరిగిన వెంటనే షిపాలి ఎవరికి ఫోన్‌ చేసింది? ఎవరి సూచనలతో ఫిర్యాదులో పేర్కొనాల్సిన అంశాలను తెలుసుకుంది? ఆసుపత్రికి చేరే సమయానికి ఉన్న మూడో వ్యక్తి ఎవరు అనేది 1తేలాల్సి ఉంది. ఇంట్లో సీసీ కెమెరాలు పని చేయకపోవటం అనుమానాలకు తావిస్తోంది.

ఇంటి గేటు

ఇంటి గేటు

ఏడు అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రహరీ సుమారు ఎనిమిదిన్నర అడుగులు ఉంది. వీటి నుంచి దుండగులు లోనికి రావడం కొంచెం కష్టమే అంటున్నారు. అలాగే, వాచ్ మెన్ ఉన్నాడని గుర్తు చేస్తున్నారు. కాల్పులు జరిగిన హాలులో పెనుగులాట ఆధారాలు కూడా లేవు... ఇలా ఎన్నో అనుమానాలకు సమాధానాలు లేవని అంటున్నారు. అలాగే, హకీంబాబా దర్గాలో అన్నదానం చేసేందుకు ఉదయమే లేచినట్టు షిపాలీ ఫిర్యాదులో పేర్కొంది. నిర్వాహకులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని నిర్ధారణ అయింది. కాగా, విక్రమ్‌కు ఆర్థిక ఇబ్బందులు నిజమేనని తేలిందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+