హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'సెల్ ఫోన్' చంపేసింది: స్నేహితులే కొట్టి చంపారు, మందు పార్టీ తర్వాత..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సెల్ ఫోన్ విషయంలో తలెత్తిన ఓ వివాదం ఏకంగా యువకుడి ప్రాణాలే బలిగొన్నది. స్నేహితుడని కూడా చూడకుండా ఇద్దరు యువకులు అతనిపై తీవ్రంగా దాడి చేయడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను ఇన్‌స్పెక్టర్‌ వహీదుద్దీన్‌ వెల్లడించారు.

ఆ ముగ్గురు..:

ఆ ముగ్గురు..:

సనత్‌నగర్‌లోని తులసీనగర్‌కు చెందిన రత్నాకర్‌రాజు(35), బీకేగూడ, సంజయ్‌గాంధీనగర్‌లకు చెందిన తీగుల నవీన్‌కుమార్‌(36), దాలవాయి పూర్ణ(34).. ఈ ముగ్గురు స్నేహితులు. పూర్ణ కూడా నవీన్‌కుమార్ ఇంట్లోనే అద్దెకు ఉంటున్నాడు.

సెల్‌ఫోన్ కొన్నందుకు పార్టీ..:

సెల్‌ఫోన్ కొన్నందుకు పార్టీ..:

ఇటీవల నవీన్ కుమార్ కొత్త సెల్‌ఫోన్ కొనడంతో స్నేహితులకు పార్టీ ఇవ్వాలనుకున్నాడు. విషయాన్ని పూర్ణ, రత్నాకర్ రాజులకు చెప్పడంతో మంగళవారం రాత్రి ముగ్గురు కలిసి మందు పార్టీ చేసుకున్నారు. అర్థరాత్రి వరకు మద్యం తాగారు. అయితే ఆ సమయంలో నవీన్ కుమార్ కొత్త మొబైల్ కనిపించకపోవడం వివాదానికి కారణమైంది.

 రత్నాకర్ రాజే దొంగిలించాడని..:

రత్నాకర్ రాజే దొంగిలించాడని..:

నవీన్‌కుమార్ సెల్‌ఫోన్ కనిపించకపోవడంతో.. పూర్ణ సెల్‌ఫోన్ నుంచి ఆ నంబర్‌కు ఫోన్ చేశారు. దీంతో రత్నాకర్‌రాజు జేబులోనే ఆ సెల్‌ఫోన్ మోగింది.

తాగిన మత్తులో సెల్ ఫోన్ జేబులో పెట్టుకున్నాడో లేక కావాలనే చేశాడో తెలియదు కానీ.. స్నేహితులు మాత్రం అతనిపై దొంగతనం ఆరోపణలు వేశారు. ఆగ్రహావేశంతో నవీన్ కుమార్ అతన్ని తీవ్రంగా కొట్టాడు.

కొట్టి చంపారు..:

కొట్టి చంపారు..:


నవీన్‌కుమార్‌కు తోడు పూర్ణ కూడా తోడవడంతో రత్నాకర్‌రాజు తీవ్రంగా గాయపడ్డాడు. వాళ్ల నుంచి తప్పించుకుని రోడ్డు పైకి పరిగెత్తాడు. అయినా వదలని పూర్ణ, నవీన్ కుమార్‌లు అతన్ని పట్టుకుని పిడిగుద్దులు కురిపించారు. దీంతో రత్నాకర్‌రాజు కిందపడి తలకు తీవ్ర గాయాలవడంతో స్పృహ కోల్పోయాడు. 108 సిబ్బంది అక్కడికి చేరుకునేసరికి అతను మృతి చెందాడు.

 నిందితుల అరెస్ట్:

నిందితుల అరెస్ట్:

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. రత్నాకర్‌రాజుకు భార్య, కుమారుడు ఉన్నట్టు తెలిపారు. అతన్ని కొట్టి చంపిన నవీన్‌కుమార్‌, పూర్ణలను బుధవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు వెల్లడించారు.

English summary
Ratnakar Raju(35), An Ameerpet resident has died in friends attack on Tuesday midnight. Friends Purna, Naveen Kumar attacked him on the allegation of stealing cell phone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X