కెసిఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలి: విమర్శల దాడి పెంచిన జగన్
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు.
గురువారం స్టేషన్‌ఘన్‌పూర్ ఎన్నికల ప్రచార సభలో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగించారు. వరంగల్ ఉప ఎన్నిక ఎందుకు తీసుకు వచ్చారో కేసీఆర్‌ను ప్రజలు నిలదీయాలన్నారు.
ఒక్క వరంగల్ జిల్లాలోనే 150 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ రైతుల ఆత్మహత్యలకు కారణమెవరో నిలదీయాలన్నారు. లక్ష లోపు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారని, అయితే ఇంతవరకూ ఎన్ని రుణాలను మాఫీ చేశారని జగన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తాము అధికారంలోకి వచ్చాక నాలుగు దఫాలుగా రుణ మాఫీ చేస్తామన్నారని, ఇవాళ రైతుల మీద 14 శాతం అపరాధ వడ్డీ పడుతోందని అన్నారు. విడతల వారీగా కేసీఆర్ ఇచ్చే మొత్తంలో మూడొంతులు వడ్డీకే పోతోందని చెప్పారు.

ఇంకో వైపు రుణాలు రెన్యూవల్ కాకపోవడంతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందక రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. ఇక నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని, సామాన్య ప్రజలు ఏం కొనేటట్లు లేదని జగన్ అన్నారు.
18 నెలల్లో ఎన్ని ఇళ్లు కట్టించారో కేసీఆర్‌ను అడగండని అన్నారు. దివంగత సిఎం వైయస్ఆర్ ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారని చెప్పని జగన్.. కేసీఆర్ ఇప్పటివరకూ 394 ఇళ్లు మాత్రమే కట్టించారన్నారు. ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తామన్న కెసిఆర్.. ఇప్పటివరకూ ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు.
కేసీఆర్ కేవలం 1600 ఎకరాలు ఇచ్చి చేతలు దులపుకున్నారని మండిపడ్డారు. ఈ పాలకులకు బుద్ధి రావాలంటే రాజన్న రాజ్యం రావాలని అన్నారు. కాంగ్రెస్ అంత అన్యాయమైన పార్టీ ఎక్కడా ఉండదని విమర్శించారు. చంద్రబాబు పాలన అంటే అంతా అబద్ధాలు, మోసం, వెన్నుపోటేనని చెప్పారు.
అధికారంలోకి వచ్చి 18 నెలులు అయినా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. తమ పార్టీకి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications