వైఎస్ షర్మిల అరెస్ట్: రాత్రి హోటళ్లోనే, లుకౌట్ నోటీసులిచ్చారంటూ ఆగ్రహం
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి యత్నించిన వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైయస్సార్టీపీ షర్మిలతోపాటు పార్టీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి.
ఈ క్రమంలోనే షర్మిలతోపాటు ఆ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు షర్మిల మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీలో చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో పెద్దవాళ్లను తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

టీఎస్‌పీఎస్సీ ముందు ఆందోళన అంటే హౌస్ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు షర్మిల. బయటకు వెళ్లాలి అంటే ఇతర కారణాలు చూపించి తనను నిర్బంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులను మోహరించారని తెలిపారు.
#WATCH | Hyderabad, Telangana: YSRTP Chief YS Sharmila detained by the police before she reached the TSPSC office to hold a protest there regarding the paper leak issue. pic.twitter.com/Izj5x7jTDF
— ANI (@ANI) March 31, 2023
తనకు లుక్ఔట్ నోటీసులు ఇచ్చారని షర్మిల తెలిపారు. లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడానికి తాను ఏమైనా క్రిమినల్‌నా అని షర్మిల ప్రశ్నించారు. కాగా, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ తాను గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లానని.. ఒక హోటల్ రూంలో తలదాచుకుని ఉండాల్సిన పరిస్థితి ఉందని షర్మిల తెలిపారు.
TSPSC పేపర్ లీకులపై ఉద్యమిస్తున్న ఓయూ, కేయూ విద్యార్థులపై సర్కార్ చేపడుతున్న అణచివేత చర్యలను ఖండిస్తున్నాం. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి లాఠీ ఛార్జీలు, అరెస్టులు చేయడం మీ నిరంకుశ పాలనకు నిదర్శనం. నోరెత్తితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారంటే మీది రౌడీల పాలన కాకపోతే మరేంటి..! ఆనాడు మా ఉద్యోగాలు మాకే అంటూ విద్యార్థులు కొట్లాడకపోతే తెలంగాణ వచ్చేదా? వందల మంది నిరుద్యోగులు బలిదానాలు చేసుకోకపోతే రాష్ట్రం సిద్దించేదా..? ఉద్యమ సమయంలో పోటీ పరీక్షలు రాయొద్దని విద్యార్థులను రెచ్చగొట్టి, మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అంటూ షర్మిల ఆరోపించారు.
నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న నాపై LOOK OUT నోటీసులు ఇవ్వడం KCR నియంత పాలనకు నిదర్శనం. ఇప్పటికే రెండుసార్లు హౌజ్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు దుర్మార్గంగా LOOK OUT నోటీసులు ఇచ్చి, పోలీసులను ఉసిగొల్పుతున్నారు. TSPSC ప్రశ్నాపత్రాల కుంభకోణంలో SIT పెద్ద తలకాయలను వదిలేస్తోంది. pic.twitter.com/e0WxmN3eQW
— YS Sharmila (@realyssharmila) March 31, 2023
ఉద్యమానికి విశ్వవిద్యాలయాలు ఊపిరి అని చెప్పి ఇప్పుడు నీ రక్షణ సైన్యాన్ని పెట్టి నోరు ఎత్తుకుండా చేస్తున్న మీ పాలన రాజరికపు పాలనకు నిదర్శనం. 9 ఏళ్లుగా ఊరించి ఊరించి వేసిన నోటిఫికేషన్లకు మీ నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగాలు అందకపాయే. లీకులతో ఉద్యోగాలకు లాకులు పడే. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను అంగట్లో పెడితివి. కోచింగ్ సెంటర్లకు లక్షలకు లక్షలు పోసి శిక్షణ తీసుకున్న నిరుద్యోగులకు భరోసా లేకపాయే. నిజంగా లీకుల వెనుక మీ హస్తం లేకపోతే, మీరు సుద్ధపూస అయితే విద్యార్థులు అడుగతున్నట్లు SIT తో కాకుండా CBI తో దర్యాప్తు చేయించు.. లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు తక్షణ సహాయం 50 వేలు ప్రకటించు. ఇవేమీ చేతకాక..మాకేం సంబంధం అనడం..ప్రశ్నస్తే పరువు నష్టం దావాలు వెయ్యడం...SIT ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇయ్యడం,హౌజ్ అరెస్టులు చేయడం తప్పా మరొకటి చేతకాదు అంటూ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications