• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షర్మిల ఎప్పటికీ ఆంధ్రావాదే... ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ జనం సహించరు... టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్..

|

వైఎస్ షర్మిల తనను తాను తెలంగాణవాది అని చెప్పుకుంటే ఎవరూ నమ్మరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. షర్మిల ఎప్పటికీ ఆంధ్రావాదియే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై షర్మిల అవాకులు,చవాకులు పేలారని... ఆయన్ను విమర్శించే స్థాయి ఆమెకు లేదని మండిపడ్డారు. పదువులకు ఆశపడి ఎవరో డైలాగులు రాసిస్తే... షర్మిల వాటిని చదువుతున్నారని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో అసలు ప్రజాస్వామ్యం లేదని... అక్కడ అరాచక పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. షర్మిల తన అన్న మీద పోరాటం చేయలేక తెలంగాణకు వచ్చి పోరాటం చేస్తాననడం,ప్రశ్నించే గొంతుక అవుతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సినిమా స్క్రిప్ట్,డైలాగులు చదువుతూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించబోరని హెచ్చరించారు.

ys sharmila forever an andhra ideologist trs mla sandra venkata veeraiah critisises her

ఖమ్మంలో శుక్రవారం(ఏప్రిల్ 10) నిర్వహించిన సంకల్ప సభలో వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. 'కేసీఆర్‌ హయాంలో పెన్షన్లు లేవు, కార్పోరేషన్లకు నిధులు లేవు. దళితులకు మూడెకరాల భూమి ఏమైంది సీఎం సారూ?' అంటూ షర్మిల సీఎంపై విమర్శలు గుప్పించారు. 'ప్రజా సమస్యలు వినే ఓపిక ఈ దొరలకు ఉందా? సచివాలయంలో అడుగుపెట్టని ఇలాంటి సీఎం దేశంలో ఎవరూ లేరు. తాను అడుగుపెట్టని సచివాలయం ఎందుకని కూల్చేశాడు. ఏ అధికారి ఎక్కడ పనిచేస్తున్నాడో అర్థం కావట్లేదు. సింగరేణి కార్మికుల మైనింగ్‌ సమస్య తీరిందా? కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలు మీకు పట్టవా?..' అంటూ ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయని... 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని షర్మిల పేర్కొన్నారు. 30 మంది యువత ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్‌కు చీమ కుట్టినట్లయినా అనిపించడం లేదన్నారు. నడిరోడ్డుపై న్యాయవాద జంటను హత్య చేస్తే దున్నపోతుపై వాన పడినట్లే ప్రభుత్వం తీరు ఉందన్నారు. ఆత్మగౌరవం దొర చెప్పు కింద నలిగిపోతుంది... నీళ్లు,నిధులు,నియామకాలన్నీ కేసీఆర్ కుటుంబానికే అంటూ విమర్శించారు.రాష్ట్రంలో పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదని... ప్రశ్నించేందుకే తాను పార్టీ పెడుతున్నానని చెప్పారు.

  #Telangana severe Heatwaves : High Temperatures In Telangana మండుతున్న ఎండలు

  పార్టీ పెట్టకముందే షర్మిల కేసీఆర్‌,ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో దీనిపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. షర్మిల విమర్శలపై టీఆర్ఎస్ నాయకులు తొందరపడి కామెంట్ చేయట్లేదు. ప్రస్తుతానికి ఆమె పార్టీని,ఆమె రాజకీయాలను చూసీ చూడనట్లే వ్యవహరించాలన్న ధోరణిలో ఉన్నారు. అయితే సండ్ర వెంకట వీరయ్య,గంగుల కమలాకర్ లాంటి నేతలు మాత్రం అడపా దడపా షర్మిల విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు.

  English summary
  TRS MLA Sandra Venkata Veeraiah said that no one would believe YS Sharmila if she called herself a Telangana supporter. Veeraiah said she will always be an Andhra person. Sharmila does't have stature to criticise CM KCR, he added.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X