బీఆర్ఎస్ పార్టీకి షాకింగ్ అర్ధం చెప్పిన వైఎస్ షర్మిల; కేసీఆర్ ను ఉరేసుకోమని తీవ్రవ్యాఖ్యలు!!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గాల వారీగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల టిఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై, కెసిఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇక కేసీఆర్ జాతీయ పార్టీ పైన కూడా వైఎస్ షర్మిల తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీకి కొత్త అర్ధం చెప్పిన షర్మిల

బీఆర్ఎస్ పార్టీకి కొత్త అర్ధం చెప్పిన షర్మిల

రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించకుండా కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారట అంటూ ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న సమస్యలను ఏకరువు పెట్టి తిట్టిపోసిన షర్మిల, తాజాగా కెసిఆర్ పెట్టబోతున్న టిఆర్ఎస్ పార్టీకి కొత్త డెఫినిషన్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అంటే అర్థం బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అంటూ వైయస్ షర్మిల టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణ గా మార్చిన కెసిఆర్ కొత్త పార్టీ బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ కాకపోతే ఏమౌతుంది అంటూ షర్మిల సెటైర్లు వేశారు. రాష్ట్రంలో గుడులు, బడులు కంటే ఎక్కువగా బార్లు, వైన్ లు, బెల్ట్ షాపులు ఉన్నాయని వైయస్ షర్మిల టార్గెట్ చేశారు.

 కేసీఆర్ ఉరేసుకుని చచ్చిపో ..

కేసీఆర్ ఉరేసుకుని చచ్చిపో ..


తెలంగాణ రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందని వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆడవాళ్లపై దాడుల్లో తెలంగాణ టాప్ లో ఉందని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఆడవాళ్లకు కూడా రక్షణ కల్పించడంలో విఫలమైన కెసిఆర్ ఎందుకు బ్రతికున్నట్టు అంటూ మండిపడిన వైయస్ షర్మిల కెసిఆర్ ఉరేసుకుని చచ్చిపోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్ల బాలికపై రాజకీయ నాయకుల కొడుకులు అత్యాచారం చేస్తే, ఇప్పటివరకు వారిని శిక్షించింది లేదని, తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరిగేది కనిపించటం లేదని వైయస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు.

కేసీఆర్ చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఏం చేశావ్

కేసీఆర్ చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఏం చేశావ్

తెలంగాణ రాష్ట్రంలో చిన్న బిడ్డకు కూడా రక్షణ లేదని, హైదరాబాద్ లాంటి నగరం లోని ప్రభుత్వ వాహనంలో ఇన్నోవా లోనే చిన్న పిల్లల పై అత్యాచారం జరిగితే, కేసీఆర్ ఏం చేశారు అంటూ నిలదీశారు. గతంలో ఆడవాళ్ళ వైపు ఎవరైనా దుర్బుద్ధితో చూస్తే గుడ్లు పీకుతానన్న కేసీఆర్ ఎవరి గుడ్లు పీకారో చెప్పాలని ప్రశ్నించారు. కెసిఆర్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం గా మారిందని, అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని షర్మిల పేర్కొన్నారు.

నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోని సీఎం ఎందుకు

నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోని సీఎం ఎందుకు


మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైయస్ షర్మిల స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకొని, ప్రజా సమస్యలను పరిష్కరించలేక పోతున్నారని సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో, రెండు రేకులేసుకుని, బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్న అవ్వలకు ఇండ్లు, పింఛన్లు ఇవ్వలేని ప్రభుత్వం ఉండి ఎందుకు? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, నిస్సాహాయ స్థితిలో ఉన్నవారిని కూడా ఆదుకోని ముఖ్యమంత్రి ఎందుకు? అంటూ షర్మిల నిలదీశారు. తలదించుకుని రాజీనామా చెయ్ కెసిఆర్ అంటూ షర్మిల టార్గెట్ చేశారు.

మహాత్మాగాంధీతో పోల్చుకోడానికి సిగ్గుగా లేదా కెసిఆర్

సీఎం కేసీఆర్ తనను తాను మహాత్మాగాంధీతో పోల్చుకుంటున్నారని మండిపడిన వైయస్ షర్మిల మహాత్మాగాంధీతో పోల్చుకోడానికి సిగ్గుగా లేదా కెసిఆర్ అంటూ ప్రశ్నించారు. ప్రజలు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చింది కానీ నీ దొంగ దీక్షకు కాదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్ర సొమ్మును పదికొక్కుల్లా తిని, ఇప్పుడు దేశాన్ని లూటీ చేయడానికి విమానాలు కొంటున్నారు అని వైయస్ షర్మిల ఎద్దేవా చేశారు. మహాత్మాగాంధీ పేరు ఉచ్చరించే అర్హత కూడా కెసిఆర్ కు లేదని వైయస్ షర్మిల విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+