Komatireddy Venkata Reddyకి షర్మిల ఆహ్వానం..రేవంత్‌కు చెక్ పెట్టేందుకేనా..?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉన్న రాజకీయ పోరాటం నేటి నుండి కొత్త టర్న్ తీసుకుంటోంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు...షర్మిల కొత్త పార్టీతో కొత్త రాజకీయం తెర మీదకు వచ్చింది. ఇదే సమయంలో కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం చివరి నిమిషం వరకు బరిలో ఉన్న కోమటిరెడ్డి తనకు కాదని రేవంత్ కు బాధ్యతలు అప్పగించటం పైన తీవ్ర వ్యాఖ్యలే చేసారు. ఆ తరువాత హైకమాండ్ జోక్యంతో సద్దుకున్నారు.

 రేవంత్ తో దూరం..షర్మిల ఆహ్వానం..

రేవంత్ తో దూరం..షర్మిల ఆహ్వానం..

రేవంత్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కోమటిరెడ్డి దూరంగా ఉన్నారు. కానీ, ఈ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమయ్యాయి. తెలంగాణలో ఈ రోజు షర్మిల కొత్త పార్టీ ప్రారంభిస్తున్నారు. ఈ సమయంలో షర్మిల పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పార్టీ సభ జరుగనున్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఆగి వైఎస్సార్ అభిమానులతో ఎంపీ ముచ్చటించారు. పార్టీ ఆవిర్భావ వేడుకకు రావాలని తనకు ఆహ్వానం పంపారని ఆయన తెలిపారు. వైఎస్ గొప్ప నేత అని కొనియాడారు.

 తొలి నుండి వైఎస్సార్ అనుచరుడుగా..

తొలి నుండి వైఎస్సార్ అనుచరుడుగా..

వైఎస్ జయంతి సందర్భంగా భువనగిరిలో ఆయనకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి తొలి నుండి వైఎస్సార్ అనుచరుడిగానే ఉన్నారు. 2009 లో వైఎస్సార్ రెండో సారి అధికారంలోకి వచ్చిన సమయంలో నల్గొండ జిల్లా నుండి జనారెడ్డిని సైతం పక్కన పెట్టి కోమటిరెడ్డికి క్యాబినెట్ లో అవకాశం కల్పించారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన తెలంగాణలో కోమటిరెడ్డి ఎప్పటికప్పుడు తన ప్రత్యేకత చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

Recommended Video

    YS Sharmila Party Name : సర్వే రిపోర్ట్.. ఎన్ని సీట్లు ? పార్టీ పేరు మారిందా..? || Oneindia Telugu
     రెడ్డి సామాజిక వర్గానికి ఇద్దరూ వల..

    రెడ్డి సామాజిక వర్గానికి ఇద్దరూ వల..

    ఇక, ఇప్పుడు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గంతో పాటుగా ..వైఎస్సార్ అభిమానుల మద్దతు తమ వైపే ఉండే విధంగా షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో రేవంత్ సైతం రెడ్డి సామాజిక వర్గం..కాంగ్రెస్ లోనే చివరి దాకా ఉన్న వైఎస్సార్ అభిమానులు తనకే మద్దతిస్తారని రేవంత్ చెబుతున్నారు. ఈ సమయంలో కోమటిరెడ్డికి నల్గొండ జిల్లాలో బలమైన వర్గం ఉంది. తాజాగా కోమటిరెడ్డి సైలెంట్ గా ఉంటున్నా..రాజకీయంగా రానున్న రోజుల్లో ఆయన వేసే అడుగులు కీలకం కానున్నాయి. అందులో రేవంత్ కు పరోక్షంగా జలక్ ఇచ్చేందుకే షర్మిల పార్టీ ఆహ్వానం పంపిందనే విషయాన్ని చెప్పటంతో పాటుగా...షర్మిలకు ఆల్ ది బెస్ట్ చెప్పారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో...ఇప్పుడు కోమటిరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి అడుగులు వేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇక, తెలంగాణ రాజకీయాల్లో ప్రతీ రోజు కొత్త పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+