పేద విద్యార్థులకు పట్టెడన్నం పెట్టలేరా? విషపుకూడు పెట్టి చంపేస్తారా కేసీఆర్? వైఎస్ షర్మిల ఫైర్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిత్యం విరుచుకుపడుతున్న వైఎస్ షర్మిల తాజాగా మరోమారు తెలంగాణ రాష్ట్రంలోని హాస్టళ్లలో విద్యార్థుల వసతిపై, వారికి అందిస్తున్న భోజనంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వం అందిస్తున్న భోజనం విద్యార్థుల ప్రాణాలమీదకు తెస్తుందని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శలు గుప్పించారు. పేద విద్యార్థులకు కనీసం పట్టెడన్నం కూడా పెట్టలేని దయనీయమైన స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందా? అంటూ నిప్పులు చెరిగారు.

ఉస్మానియా హాస్టల్ నుంచి ఊర్లో ఉన్న గురుకుల హాస్టల్స్ వరకు.. పురుగుల అన్నమే
రాష్ట్రంలో ఎక్కడ ఏ హాస్టల్ లో చూసినా విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని వైయస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. ఉస్మానియా హాస్టల్ నుంచి ఊర్లో ఉన్న గురుకుల హాస్టల్స్ వరకు ఎక్కడచూసినా పురుగుల అన్నం, ముక్కపట్టిన బియ్యం పెడుతున్నారని మండిపడ్డారు. కూరల్లో వానపాములు, బొద్దింకలు, ఎలుకలు పడుతున్నా పట్టించుకోవడంలేదని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో హాస్టల్స్ వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు.. మండిపడిన షర్మిల
రాష్ట్రంలో హాస్టల్స్ లో వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. మొన్న బాసర ట్రిపుల్ ఐటిలో వందల మంది విద్యార్థులు, నిన్న మహబూబాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 36 మంది విద్యార్థులు, ఇవాళ సిద్ధిపేట సాంఘిక సంక్షేమహాస్టల్ లో 22 మందికి ఫుడ్ పాయిజన్ అయిందని వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు పెట్టిన భోజనం తిని ఓ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయినా కానీ కండ్లు తెరువలేదు దొర అంటూ కేసీఆర్ తీరుపై మండిపడ్డారు.

పేద విద్యార్థులకు బుక్కెడు అన్నం పెట్టడం కూడా బరువేనా?
అయ్యా కేసీఆర్ గారు, కనీసం మా పేద విద్యార్థులకు బుక్కెడు అన్నం పెట్టడం కూడా బరువేనా? అంటూ షర్మిల ప్రశ్నించారు. చదువుల కోసం పంపిస్తే వాళ్లకు విషపు కూడు పెట్టి చంపేస్తున్నావ్ కదా కేసీఆర్ అంటూ వైఎస్ షర్మిల తనదైన శైలిలో సీఎం కేసీఆర్ పై, తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోను బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థి జీర్ణకోశ వ్యాధితో మృతి చెందిన ఘటనపైన కూడా వైయస్ షర్మిల తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదువుకునే పిల్లలకు సరైన తిండి పెట్టని సర్కారు ఉంటే ఎంత? ఊడితే ఎంత?
విద్యార్థులకు కలుషిత అన్నం పెట్టి వారి చావులకు కారణమవుతున్నారు అంటూ మండిపడ్డారు. చదువుకునే పిల్లలకు సరైన తిండి పెట్టని సర్కారు ఉంటే ఎంత? ఊడితే ఎంత? అంటూ గతంలోనూ వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణా ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ఎత్తిచూపుతూ వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారారు.
-
స్పైసీ 'గోంగూర పన్నీర్ కర్రీ'.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications