నేనా మాటంటే నీ తల ఎక్కడ పెట్టుకుంటావ్ సత్యవతి రాథోడ్: వైఎస్ షర్మిల కౌంటర్!!
తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని మానుకోట రాళ్ల దెబ్బలు చవి చూపిస్తామని హెచ్చరించిన సత్యవతి రాథోడ్ కు వైయస్ షర్మిల ఘాటుగా రిప్లై ఇచ్చారు. తనను శిఖండి అంటూ చేసిన వ్యాఖ్యలపై వైయస్ షర్మిల సత్యవతి రాథోడ్ కు చురకలంటించారు. లోటస్ పాండ్ లో రెండో రోజు ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న షర్మిల సత్యవతి రాథోడ్ తనపైన చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చారు.

సూర్పణఖ అనగలను అని, కానీ తనకు సంస్కారం ఉంది: వైఎస్ షర్మిల
తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక మహిళ అయి ఉండి తనను శిఖండి అంటూ సత్యవతి రాథోడ్ వ్యాఖ్యలు చేశారని అదే మాట తాను అంటే తల ఎక్కడ పెట్టుకుంటారు అంటూ ప్రశ్నించారు. సత్యవతీ రాథోడ్ ను తాను సూర్పణఖ అనగలను అని, కానీ తనకు సంస్కారం ఉంది కాబట్టి అనటం లేదని, తనపై సత్యవతి రాథోడ్ చేసిన వ్యాఖ్యలను ఆమె విచక్షణకే వదిలేస్తున్నా అంటూ వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు.

గిరిజనుల కోసం మీరు చేసిందేంటి?
గిరిజన మంత్రి అయ్యుండి గిరిజనుల సమస్యల కోసం నోరు విప్పని మంత్రి, తనపై మాత్రం మాటల దాడి చేస్తుందని విమర్శించారు. ఇప్పుడు ఎన్నో మాట్లాడుతున్న సత్యవతి రాథోడ్ ఏనాడైనా పోడు భూముల కోసం కొట్లాడుతున్న ఆదివాసీల కోసం నోరు విప్పారా అంటూ ప్రశ్నించారు. బిడ్డల తల్లులను జుట్టు పట్టుకొని కొట్టి జైల్లో పెడితే వారి తరఫున మాట్లాడారా అంటూ నిలదీశారు. మరియమ్మ అనే ఒక ఎస్సీ మహిళ జైల్లోనే చనిపోయినా స్పందించలేదని, మహిళా మంత్రి అయ్యుండి తను ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.
పదవి ఉంటే సరిపోదు ఇంగితం ఉండాలి.. సత్యవతికి షర్మిల చురకలు
మహిళల కోసం ఏనాడు మాట్లాడని మంత్రి సత్యవతి రాథోడ్ తనను శిఖండి అని ఏవిధంగా అన్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి ఉంటే సరిపోదని కాస్త ఇంగితం కూడా ఉండాలంటూ చురకలంటించారు. పదవికి తగ్గట్టుగా హుందాతనం కూడా ఉండాలని వైయస్ షర్మిల సత్యవతి రాథోడ్ ను టార్గెట్ చేశారు. మాట్లాడే ముందు అలోచించి మాట్లాడాలన్నారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శలు చెయ్యలేదని స్పష్టం చేశారు.

షర్మిలను టార్గెట్ చేసి సత్యవతి రాథోడ్ తీవ్ర విమర్శలు
ఇదిలా ఉంటే ఇప్పటికే సత్యవతి రాథోడ్ వైఎస్ షర్మిలను తీవ్రస్థాయిలో టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. వైయస్ షర్మిల ఆడిన నాటకానికి ప్రధాని నరేంద్ర మోడీ సూత్రధారి అంటూ పేర్కొన్న ఆమె, వైయస్ షర్మిల శిఖండిలా రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆడపిల్ల కదా అని వదిలేస్తే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుందని మండిపడిన ఆమె రాళ్లకు పని చెప్పే పరిస్థితి మళ్ళీ తీసుకురావద్దంటూ వైయస్ షర్మిల కు హెచ్చరికలు జారీ చేశారు పాదయాత్ర పేరుతో షర్మిల టీఆర్ఎస్ స్థానిక నాయకుల పై, సీఎం కేసీఆర్ పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తే సహించేది లేదని సత్యవతి రాథోడ్ తేల్చి చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే వైయస్ షర్మిల మంత్రి సత్యవతి రాథోడ్ పై ఎదురు దాడికి దిగారు. ఆమెకు చురకలు అంటించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications