నేడు గవర్నర్ తమిళిసైతో వైఎస్ షర్మిల భేటీ.. ఆపై పాదయాత్ర పునఃప్రారంభం; షెడ్యూల్ ఇలా!!
నేడు గవర్నర్ తమిళిసైతో వైఎస్ షర్మిల భేటీ అవుతారు. ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్రంలో పరిస్థితిపై ఫిర్యాదు చేస్తారు. ఆపై పాదయాత్ర నర్సంపేట నియోజకవర్గం నుండి పునఃప్రారంభం అవుతుంది. ఈ మేరకు షెడ్యూల్ ఇలా ఉంది.
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మళ్లీ ప్రజాప్రస్థానం పాదయాత్రను నేటి నుంచి కొనసాగించనున్నారు. ఈ మేరకు వైయస్ షర్మిల షెడ్యూల్ ఖరారైంది. ఇక మరోవైపు ఈరోజు వైఎస్ షర్మిల తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి తెలంగాణ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేయనున్నారు.

నేడు గవర్నర్ ను కలవనున్న వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇప్పటికే అనేక మార్లు గవర్నర్ తమిళిసైని కలిసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలన పైన ఫిర్యాదు చేశారు. ఇక తాజాగా నేడు వైయస్ షర్మిల రాజభవన్ కి వెళ్లి గవర్నర్ తో సమావేశం కానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను, అలాగే ప్రభుత్వ వైఫల్యాలను గవర్నర్ కు వివరించి వైఎస్ షర్మిల గవర్నర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వినతిపత్రం ఇవ్వనున్నారు.

తమిళి సైతో భేటీ తర్వాత పాదయాత్ర పునః ప్రారంభం
మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ తమిళి సై తో భేటీ అయి, గవర్నర్ తో భేటీ అనంతరం నేరుగా నర్సంపేట నియోజకవర్గానికి పాదయాత్ర చేయడానికి వెళ్ళనున్నారు. ఇక నేడు మధ్యాహ్నం మూడు గంటల నుండి నర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మూడున్నర గంటలకు చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతుందని, నాలుగు గంటలకు లింగగిరి గ్రామానికి పాదయాత్ర చేరుకుంటుందని, అక్కడ ప్రజలతో వైఎస్ షర్మిల మాట్లాడతారని పేర్కొన్నారు.

షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర.. నెక్కొండలో మాటా ముచ్చటా
ఆపై నాలుగున్నర గంటలకు సూరిపల్లి క్రాస్ రోడ్ కు చేరుకుని అక్కడ వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారని, అనంతరం ఐదు గంటలకు తోపనగడ్డ తండా గ్రామానికి చేరుకుని అక్కడ ప్రజలతో మాట్లాడతారని, ఆపై ఐదున్నర గంటలకు నెక్కొండ గ్రామంలో మాట ముచ్చట నిర్వహిస్తారని వైయస్సార్ తెలంగాణ పార్టీ పేర్కొంది. నేటి నుంచి మళ్లీ వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పునః ప్రారంభం కావడంతో పాదయాత్ర సజావుగా సాగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.

నర్సంపేట నియోజకవర్గంలో గతంలో ఆగిపోయిన పాదయాత్ర
గతంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్న సమయంలో నర్సంపేట నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో వైయస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది. నర్సంపేట నియోజకవర్గం లో శంకరమ్మ తండా వద్ద పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను, స్థానిక బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడం, ఆమె ఉపయోగించే కేరవాన్ కు నిప్పంటించడం, ఆపై ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించడం చోటుచేసుకున్నాయి.

వైఎస్ షర్మిల అరెస్ట్.. పాదయాత్ర భగ్నం.. మళ్ళీ షరతులతో అనుమతి
ఇక అప్పుడు జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేయడానికి ప్రగతి భవన్ కు వెళ్లాలని ప్రయత్నించిన వైఎస్ షర్మిలను వాహనంతో సహా అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపింది. అప్పుడు జరిగిన ఘటనపై ప్రతిపక్షాలతో పాటు,గవర్నర్ కూడా స్పందించారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వైయస్ షర్మిల పాదయాత్రను కొనసాగించలేకపోయారు. నేటి నుంచి పాదయాత్రను మళ్ళీ కొనసాగించడానికి వైఎస్ షర్మిల రెడీ అవుతున్నారు. మరి వైఎస్ షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన నేపధ్యంలో ఈ పాదయాత్రను షరతులకు లోబడి వైఎస్ షర్మిల కొనసాగిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications