వర్చువల్ టెక్నాలజీ: వైఎస్ షర్మిల పార్టీ ముహూర్త సమయాన్ని ఫిక్స్ చేసింది ఎవరు?
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. చారిత్రాత్మక ఘట్టానికి సమాయాత్తమౌతోన్నారు. తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీని నెలకొల్పడానికి ముహూర్తం సమీపిస్తోంది. తన తండ్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన అధికారికంగా పార్టీని ప్రకటించనున్నారు. దీనికోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్టీ ప్రకటన వేదిక ఖరారైంది. షెడ్యూల్ ఫిక్స్ అయింది. దీనికి సంబంధించిన పోస్టర్లను పార్టీ నాయకులు ఆవిష్కరించారు.
బహిరంగ సభ ద్వారా పార్టీని ప్రకటించాలని తొలుత వైఎస్ షర్మిల నిర్ణయించుకున్నప్పటికీ.. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దెబ్బ కొట్టింది. ఫలితంగా- జన సమీకరణ లేకుండా, వర్చువల్ విధానంలో పార్టీని ప్రకటించనున్నారామె. డిజిటల్ టెక్నాలజీ రూపంలో పార్టీ అధికారిక ప్రకటన సమాచారాన్ని జనంలోకి తీసుకెళ్లనున్నారు. దీనికి పార్టీ నాయకులు, జిల్లా సమన్వయకర్తలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. కోవిడ్ ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ నెల 8వ తేదీన అంటే గురువారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు వైఎస్ షర్మిల.. తాను పెట్టదలచుకున్న రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. ఆ వెంటనే జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం అజెండాను ఖరారు చేస్తారు. తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ సమీపంలోని విష్పర్ వ్యాలీలో గల జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ పార్టీ అధికారిక ప్రకటన ఉంటుంది. దీనికి పరిమితంగా నాయకులను ఆహ్వానించారు.

Recommended Video
మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ పేరును ప్రకటించాలంటూ తీసుకున్న నిర్ణయం వెనుక ఆమె స్వస్థలం పులివెందులకు చెందిన కొందరు సమీప బంధువులు ఉన్నట్లు తెలుస్తోంది. పులివెందుల పట్టణానికి చెందిన ఆలయ అర్చకులను సంప్రదించిన తరువాత దీన్ని నిర్ధారించారని సమాచారం. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. పార్టీ సీనియర్ నాయకుడు కొండా రాఘవరెడ్డి సూచనలను కూడా వైఎస్ షర్మిల పరిగణనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications