• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ షర్మిల యాత్ర షురూ..19వ తేదీ నుంచి రైతు ఆవేదన యాత్ర

|
Google Oneindia TeluguNews

వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి యాత్ర చేపట్టబోతున్నారు. ఈ సారి రైతుల కోసం ఆమె పాదయాత్ర చేయబోతున్నారు. కాసేపటి క్రితం స్వయంగా ఆమె ప్రకటించారు. రైతులకు భరోసా కల్పించడానికి ఈ నెల 19 నుంచి రైతు ఆవేదన యాత్ర చేపడుతానని షర్మిల తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత యాత్ర స్టార్ట్ చేస్తామని ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక, ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో యాత్ర గురించి షర్మిల ప్రకటన చేశారు.

పరామర్శకు వెళితే..

పరామర్శకు వెళితే..

రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళితే.. తమను అరెస్ట్ చేశారని ఆరోపించారు. తమ యాత్రలను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చ‌రించారు. 70 రోజుల్లో 200 వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని షర్మిల గుర్తుచేశారు. వారి కుటుంబాలకు అండగా ఉండాల్సిన సీఎం కేసీఆర్.. తీర్దయాత్రల్లో బిజీగా ఉన్నారని మండిప‌డ్డారు. ప్రతీ బాధిత కుటుంబానికి కనీసం రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కొనుగోళ్ల సంగతి ఏంటీ

కొనుగోళ్ల సంగతి ఏంటీ

వెంటనే వరి కొనుగోళ్లు చేయాలని షర్మిల తెలిపారు. వానకాలం పంట కొనుగోలు ఎప్పటికీ పూర్తవుతుందని అడిగారు. యాసంగిలో రైతులు ఏ పంట వేసుకోవాలని అడిగారు. వరి పంట పండే రైతులు ఏం చేయాలని అడిగారు. దాదాపు రాష్ట్రంలో వరి పంటనే ఎక్కువగా సాగవుతుంది. ఆ పంటను వేయొద్దని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

ఆ సీఎం మనకు వద్దు

ఆ సీఎం మనకు వద్దు

వరి వద్దనే సీఎం మనకు వద్దని వైఎస్ షర్మిల అంతకుముందు అన్నారు. దిగుబడి సరిగా రాక, కేసీఆర్ యాసంగిలో వరి వేయవద్దని అనడంతో కొందరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. పొలాల్లో వడ్లు పండించాల్సిన రైతు ఎందుకు ఉరివేసుకుంటున్నాడు..? నాట్లు వేసుకోవాల్సిన రైతు నడిరోడ్డున ఎందుకు పడ్డాడు..? కేసీఆర్ నియంత పాలనతో రైతులు ఆగమైపోతున్నారు. పండించిన పంటను అమ్ముకోలేక వరి కుప్పల మీదే రైతులు ప్రాణాలు వదులుతున్నారు. వరి వేయవద్దని కేసీఆర్ చెబుతున్న మాటలకు అప్పులెలా తీర్చుకోవాలి, కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థంకాక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని షర్మిల అన్నారు.

 కమీషన్లే..

కమీషన్లే..

ఓ వైపు క‌మీష‌న్లు మ‌రోవైపు రైతుల ప్రాణాలు తీసుకుంటున్న కేసీఆర్.. ఆయ‌న ఆక‌లి ఎప్పుడు తీరుతోంద‌ని ప్ర‌శ్నించారు. సీఎం కేసీఆర్ కు రైతుల ఉసురు తాకుంతుంద‌ని పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్ని పుణ్య‌క్షేత్రాలు తిరిగినా చేసిన పాపం పోద‌ని తెలిపారు. బంగారు తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్.. ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు. రైతులు సంతోషంగా జీవించకుండా చేస్తున్నారు. వడ్లు అమ్ముడుపోక, అప్పులు ఎక్కువై రైతులు సూసైడ్ చేసుకుంటున్నా కేసీఆర్ కు చీమ కుట్టినట్లు కూడా లేదు. వడ్ల కుప్పల మీదే రైతులు ప్రాణాలు వదులుతున్న పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారు. వరి వేయొద్దని చెప్పినందుకు గాను రైతులకు ఏం పంట వేయాలో తెలియక, అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ధరణిలో తమ భూములు కనిపించకుండా పోయాయని ఆవేదన చెందుతున్నారు.

తప్పని తిప్పలు

తప్పని తిప్పలు

కేసీఆర్ నియంత పాలనలో రైతులు ముప్పుతిప్పలు పడుతున్నారు. పచ్చని పొలాల్లో హాయిగా సాగు చేసుకోవాల్సిన రైతులు నేడు పాడె ఎక్కుతున్నారు. వరి నాట్లు వేసుకోవాల్సిన రైతులు ఉరి తాళ్లు వేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలే కనిపిస్తున్నాయి. ఏడేళ్లలో 7వేల మందికి పైగా రైతులు చనిపోయారు. రైతులను కోటీశ్వరులను చేశామని చెబుతున్న కేసీఆర్.. రైతుల ఆదాయం 1600 మాత్రమమేనని, స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించిందని తెలుసుకోలేకపోతున్నారు. గత 70 రోజుల్లో 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే అన్నదాత పరిస్థితి ఏంటో అర్థం అవుతోందన్నారు.

 కనిపించడం లేదా..?

కనిపించడం లేదా..?

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలే లేవని చెబుతున్న టీఆర్ఎస్ పెద్దలకు పేపర్లలో వచ్చే కథనాలు కనిపించడం లేదా? పాదయాత్రలు చేస్తున్నారని విమర్శలు చేసే కేటీఆర్ కు రైతుల రోద‌న క‌నిపించ‌డం లేదా? అయ్యా, కొడుకులు మాటలు చెప్పే వారే కానీ, పూటకు భత్యం ఇచ్చే పుణ్యాత్ములు మాత్రం కాదు. పేప‌ర్ల‌లో వ‌చ్చే క‌థ‌నాల‌న్నీ కేటీఆర్ మొఖం మీద కొట్టాలి. రైతుల‌కు రుణ‌మాఫీ, వ‌డ్డీ లేని రుణాలు, న‌ష్ట‌పోయిన పంట‌కు ప‌రిహారం ఇస్తామ‌ని చెప్పిన కేసీఆర్ ఏ ఒక్క‌టీ నెర‌వేర్చ‌లేదు. రైతుల‌కు ఇన్ పుట్ సబ్సిడీ, విత్తన సబ్సిడీ, యంత్రలక్ష్మీ, ఫ‌సల్ బీమా ప‌థ‌కాల‌న్నీ అట‌కెక్కాయి. ఆరుగాల‌కం క‌ష్ట‌ప‌డి పండించిన పంట‌లను కొనాల‌న్న సోయి కూడా కేసీఆర్ కు లేదా? తాము రైతు నేస్తం, రైతు బంధువులం అని చెప్పుకునే టీఆర్ఎస్ నాయ‌కుల‌కు రైతుల మ‌ర‌ణాలు క‌నిపించ‌డం లేదా? అని ప్రశ్నించారు.

English summary
ysrtp chief ys sharmila raithu avedana yatra starts on 19th december
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X