కేటీఆర్ పుట్టినరోజునూ వదలని వైఎస్ షర్మిల .. ఆ హృదయం ఇవ్వాలని షాకింగ్ ట్వీట్ తో పాటు కానుక కూడా !!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీతో అరంగేట్రం చేసి రాజన్న రాజ్యం స్థాపిస్తానని ప్రకటన చేసిన దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ వైయస్ షర్మిల తెలంగాణ రాజకీయాలలో తన మార్క్ దూకుడును చూపిస్తున్నారు. ఇక ఈ రోజు కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు, మెగా రక్తదాన శిబిరాలు, వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మంత్రి కేటీఆర్ కు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువగా మారాయి.ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ పుట్టినరోజున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైయస్ షర్మిల ఆసక్తికర ట్వీట్ చేశారు.

భగవంతుడు మీకు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపే మనసు ఇవ్వాలి

భగవంతుడు మీకు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపే మనసు ఇవ్వాలి

పుట్టినరోజు సందర్భంగా ఇది మీకు నేను చిన్న కానుక అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. కెసిఆర్ గారి కొడుకు కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న షర్మిల, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతోపాటు, నిరుద్యోగులు ఆత్మహత్యల ఆపే హృదయాన్ని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 90 ఒకవేళ ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను, 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే మనసుని ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

Recommended Video

    YS Sharmila said that will bring the Rajanna kingdom in Telangana | Oneindia Telugu
     బాధ్యత గుర్తు చేసే చిన్న వీడియో కానుక అంటూ సూసైడ్ చేసుకున్నలావణ్య వీడియో పోస్ట్

    బాధ్యత గుర్తు చేసే చిన్న వీడియో కానుక అంటూ సూసైడ్ చేసుకున్నలావణ్య వీడియో పోస్ట్

    అంతేకాదు మీ బాధ్యతను గుర్తు చేసే చిన్న వీడియో కానుక అంటూ తన చదువు తల్లిదండ్రులకు భారం అయిందని తెలంగాణ రాష్ట్రం వనపర్తి పట్టణానికి చెందిన లావణ్య అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునే ముందు చేసిన సూసైడ్ వీడియోను కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా బాధ్యతను గుర్తు చేసే కానుకగా ఇస్తున్నానంటూ షాకింగ్ పోస్ట్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఇంతగా ఉంటే, చాలా మంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే అవేమీ పట్టటం లేదన్న భావం వచ్చేలా షర్మిల పోస్ట్ ఉంది.

    కేటీఆర్ పుట్టిన రోజును కూడా వదలకుండా నిరుద్యోగ సమస్య పై షర్మిల పోరాటం


    గత కొంత కాలంగా నిరుద్యోగ యువత కోసం నిరాహార దీక్ష చేపడుతూ సీఎం కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడుతున్న షర్మిల, నేడు కేటీఆర్ పుట్టినరోజును వదలకుండా తనదైన శైలిలో కామెంట్ చేశారు .రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరేవరకూ నిరుద్యోగ యువత పక్షాన పోరాటం సాగిస్తామని వైయస్ షర్మిల ఇప్పటికే తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకపక్క కాంగ్రెస్ రథసారధిగా రేవంత్ రెడ్డి, బిజెపి రథసారథిగా బండి సంజయ్ కెసిఆర్ ను టార్గెట్ చేసి విరుచుకు పడుతున్న వేళ, వైయస్ షర్మిల కూడా తన అస్త్ర శస్త్రాలతో అటు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద విరుచుకుపడుతున్నారు. ప్రతీవారం నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+