రైతులు, ఉద్యోగుల ప్రాణాలు పోతుంటే.. దేశం ఏల పోతావా?: కేసీఆర్‌పై షర్మిల తీవ్ర విమర్శలు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులు చనిపోతున్నా.. కేసీఆర్ సర్కార్‌కు పట్టడం లేదంటూ మండిపడ్డారు. ముందు ఇంట గెలిచి రచ్చగెలవండంటూ కేసీఆర్‌‌పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవండి దొరా' అంటూ చురకలంటించారు.

ఇంట గెలిచి.. రచ్చ గెలవండి దొరా.. : కేసీఆర్‌పై వైఎస్ షర్మిల

ఇంట గెలిచి.. రచ్చ గెలవండి దొరా.. : కేసీఆర్‌పై వైఎస్ షర్మిల


‘ఇంట గెలిచిన తరువాత రచ్చ గెలవండి దొరా. మీకు తమిళనాడు ముఖ్యమంత్రితో
మాటామంతికి, కేరళ CMతో మంతనాలు చేయడానికి, బీహార్ ప్రతిపక్ష నేతను కలసి దోస్తానా చేయడానికి, దేశ రాజకీయాల మీద చర్చ చేయడానికి సమయం ఉంది తప్ప
చనిపోతున్న రైతులను ఆదుకోవాలనే సోయి లేదు' అంటూ కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కనబడటం లేదా కేసీఆర్?

మీ రైతుబంధు వారోత్సవాల సాక్షిగా అంటూ విమర్శించారు. బ్యాంకుల ఆగడాలకు రైతులు బలైపోతున్నది మీకు కనపడుతుందా దొరా? పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకొనే రైతులు మీకు కనపడరు. వడ్డీ వ్యాపారుల చేతుల్లో నష్టపోయిన రైతులు మీకు కనపడరు. రుణాలు చెల్లించలేక ప్రాణాలు తీసుకొనే రైతులు మీకు కనపడరు. ముందు ఇక్కడి రైతుల చావులను ఆపి తరువాత దేశాన్ని ఏలపోండి అంటూ వైఎస్ షర్మిల చురకలంటించారు. ఇటీవల కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ పలు జాతీయ పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల విమర్శలు గుప్పించారు.

ఉద్యోగుల బలవన్మరణాలనూ పట్టించుకోని కేసీఆర్

ఉద్యోగుల బలవన్మరణాలనూ పట్టించుకోని కేసీఆర్


‘ఉద్యోగుల‌కు శాపంగా జీవో 317
- ఇప్ప‌టికే 9 మందికి పైగా ఉద్యోగులు మృతి
- అయినా క‌నీసం ప‌ట్టించుకోని సీఎం కేసీఆర్
- దొర పోక‌డ‌ల‌తో బ‌ల‌వుతున్న ఉద్యోగులు
ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వడం లేదంటూ కేసీఆర్ పై వైఎస్ షర్మిల మండిపడ్డారు.

Recommended Video

    BJP means Bakwas Jumla Party, says TRS Leader KTR | Oneindia Telugu
    కేసీఆర్ కుటుంబానికే నీళ్లు, నిధులు, నియామకాలంటూ షర్మిల ఫైర్

    కేసీఆర్ కుటుంబానికే నీళ్లు, నిధులు, నియామకాలంటూ షర్మిల ఫైర్

    ‘ప‌క్క‌దారి ప‌ట్టిన నీళ్లు, నిధులు, నియామ‌కాలు
    - ఉద్య‌మ ఆశ‌యాల‌కు KCR తూట్లు
    - నీళ్లు KCR ఫామ్‌హౌజ్‌కే..
    - నిధులు KCR ఇంటికే..
    - నియామ‌కాలు KCR కుటుంబానికే... నీళ్లు, నిధులు, నియామకాలు క‌ల్పించ‌డం అంటూ వైయస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+