చిన్నదొర మీరెందుకు రాజీనామా చేస్తారు?: కేటీఆర్‌పై వైఎస్ షర్మిల సెటైర్లు, సూటి ప్రశ్నలు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. శనివారం వేములవాడలో నిర్వహించిన హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాల కంటే మిగతా రాష్ట్రాల్లో మంచి పథకాలు చూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని బీజేపీ, కాంగ్రెస్ నేతలకు సవాలు విసిరారు.
ఈ నేపత్యంలో రాజీనామా చేస్తానన్న కేటీఆర్ వ్యాఖ్యలపై షర్మిల సూటి ప్రశ్నలు సంధించారు. రైతులకు రుణమాఫీ చెయ్యడం లేదని రాజీనామా చేస్తారా? రైతులు పంట నష్టపోతే ఆదుకోవడానికి పంట బీమా అమలు చేయట్లేదని రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. నోటిఫికేషన్స్ ఇవ్వకుండా, యువతను నిరుద్యోగానికి బలిచేస్తున్నందుకు రాజీనామా చేస్తారా? కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు అని మాట ఇచ్చి, ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నందుకు రాజీనామా చేస్తారా? పేదలందరికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని రాజీనామా చేస్తారా? అంటూ కేటీఆర్‌కు ప్రశ్నలు సంధించారు.

అంతేగాక, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని రాజీనామా చేస్తారా? మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వలేదని రాజీనామా చేస్తారా? పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తలేరని రాజీనామా చేస్తారా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 'మీరెందుకు రాజీనామా చేస్తారు చిన్న దొరా? మీరు సల్లంగుండాలి. రాష్ట్రం రావణకాష్టం కావాలి. అంతే కదా మీ అద్భుత పాలన? ' అంటూ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైఎస్ షర్మిల.












Click it and Unblock the Notifications