సీఎంగా రేవంత్ వద్దు- కాంగ్రెస్ కు షర్మిల పరోక్ష సూచన-కేసీఆర్ కు బైబై సూట్ కేస్..!

తెలంగాణ ఎన్నిక్లలో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా రావడంతో గళం పెంచారు. అంతే కాదు కాంగ్రెస్ పార్టీలోకి తాను రాకుండా అడ్డుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి వద్దంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎవరిని సీఎం చేయాలో కూడా చెప్పేశారు. చివరిగా సీఎం కేసీఆర్ కు బైబై సూట్ కేస్ పంపారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందంటూ పలు ఎగ్జిట్ పోల్స్ చెప్పేసిన నేపథ్యంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన షర్మిల.. సీఎం కేసీఅర్ ఇక సర్దుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఆయనకు బైబై కేసీఆర్ పేరుతో ఉన్న ఓ సూట్ కేస్ ను కూడా గిఫ్టుగా పంపారు. బైబై కేసీఆర్..కేసీఆర్ సూట్ కేసు పట్టుకుని సర్ధుకునే టైం వచ్చిందని షర్మిల తెలిపారు.
కేసీఆర్ గారు ప్యాక్ అప్ చేసుకోండి. బైబై కేసీఆర్ అన్నారు.

ys sharmila suggests congress on telangana cm candidate, sent bye bye suitcase to kcr

కేసీఆర్ పాలనకు ఎండ్ కార్డ్ పడబోతుందని షర్మిల తెలిపారు. కేసీఆర్ ప్యాక్ అప్ చేసుకునే టైం వచ్చిందన్నారు. కేసీఆర్ కు ఒక గిఫ్ట్ ఇస్తున్నామని సూట్ కేసు గురించి పేర్కొన్నారు. 2018, 2023 ఎన్నికల్లో కేవలం పదివేల తేడాతో గిలిచిన ఎమ్మెల్యేలు 33 మంది మాత్రమేనన్నారు. కర్నాటక ఎన్నికల్లో 71 మంది పదివేల మెజార్టీతో గెలిచారని, పదివేల మెజార్టీ అయినా కూడా ముఖ్యం కాబట్టి, తాము పోటీ చేసి ఒకవేళ 5,000 ఓట్లు చీల్చినా తేడా వస్తుందని దూరంగా ఉన్నామన్నారు. అందుకే కేసీఆర్ ను ఓడించాలని కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామన్నారు.

ఇన్నాళ్లు బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నారని తెలంగాణ ప్రజలకు అర్థం అయ్యిందని షర్మిల తెలిపారు. కేసీఆర్ అవినీతి మీద బీజేపీ ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదన్నారు. వీళ్లిద్దరు తోడుదొంగలు అయి కలిసే ఉన్నారని ఆరోపిస్తున్నామన్నారు.కేసీఆర్ కు మించిన కరెప్ట్ పొలిటీషియన్ లేరని అమిత్ షా చెప్పారని, ఆయన ఏ స్కీం లు చేసినా అవినీతే అని మోదీ చెప్పారన్నారు. మీరు మీరు కలిసి లేకపోతే మేం ఎంక్వేరీ వేయాలని కోరినా ఒక్క యాక్షన్ కూడా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటి కాకపోతే ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వకుండా ఉండాలన్నారు. దీన్ని రిఫరాండంగా తీసుకోవాలి తప్ప ఎమ్మెల్యేలను కొనుగోలు చేయొద్దన్నారు.

2014, 2018లో 45 మందిని కేసీఆర్ కొన్నారని, కేసీఆర్ కొన్న ఎమ్మెల్యేలు 40, ఎమ్మెల్సీ 4, ఎంపీ 1 ని కొన్నారని షర్మిల తెలిపారు. ఇది మళ్లీ రిపీట్ కాకూడదన్నారు. బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి అధికారంలోకి వచ్చే విధంగా చేయకూడదని కేసీఆర్ ను షర్మిల డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో క్రెడిబిలిటీ ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారని, ప్రభుత్వం మారాలి, ఎవరు ముఖ్యమంత్రికావాలన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని షర్మిల తెలిపారు. ఉత్తమ్ , భట్టి లాంటి వారికి సీఎం పోస్టు ఇవ్వాలని, బ్లాక్ మెయిలర్లకు ఇవ్వద్దని రేవంత్ రెడ్డిని ఉద్దేశనంచి షర్మిల కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+