వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోగ్యపరీక్షలు అటకెక్కాయా? అయ్యా ఆరోగ్యమంత్రిగారూ.. హరీష్ రావును టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం పై, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రజాప్రస్థానం పాదయాత్రలో వైయస్ షర్మిల తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ను టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైఫల్యంతో ప్రజలకు అర్థమైంది అంటూ పేర్కొన్నారు.

మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల

మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల


మంత్రి హరీష్ రావు పై విమర్శనాస్త్రాలు సంధించిన వైఎస్ షర్మిల అయ్యా ఆరోగ్యమంత్రి! మీ సర్కారు సేవలు, సర్జరీల బాగోతం మొన్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో చనిపోయిన మహిళలని చూస్తే తెలుస్తుంది అంటూ చురకలంటించారు. కార్పొరేట్ హాస్పిటల్స్ కు మీరు ఆరోగ్యశ్రీ డబ్బులు ఎగ్గొడితే, అప్పులు చేసి వైద్యం చేయించుకోలేక, దేవుడి మీద భారం వేసి, సర్కార్ దవాఖాన్లకు వస్తేనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జరీలు పెరిగాయి తప్పితే మీరు సౌకర్యాలు కల్పిస్తే కాదు మంత్రి గారు అంటూ వైయస్ షర్మిల తనదైన శైలిలో మంత్రి హరీష్ రావు పై మండిపడ్డారు.

తెలంగాణా ఆరోగ్య పరీక్షలు అటకెక్కాయి అంటూ వైఎస్ షర్మిల

తెలంగాణా ఆరోగ్య పరీక్షలు అటకెక్కాయి అంటూ వైఎస్ షర్మిల

2018 ఎన్నికల ముందు హడావుడి చేసిన కంటి వెలుగు ఆ ఏడాదే కంటికి కనపడకుండా పోయిందని వైయస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇంటింటికీ చేస్తామని చెప్పిన ఆరోగ్య పరీక్షలు అటకెక్కాయని షర్మిల పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద పరీక్షలు చేస్తే 47 శాతం మందికి అనారోగ్యమే అని తేలితే, వచ్చిన ఫలితాలతో మీ కండ్లు బైర్లు కమ్మాయన్నారు వైయస్ షర్మిల. ఇక రాష్ట్రం మొత్తం చేస్తే జనానికి మందులకు డబ్బులు పెట్టడం ఇష్టం లేక ఆరోగ్య పరీక్షలు బంద్ పెట్టారు అని షర్మిల వ్యాఖ్యానించారు. ఆఖరికి రోగాలకు మందులు ఇవ్వడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేకుండా చేశారు అని వైయస్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

వైఎస్సార్ హయాంలో సంక్షేమ పాలన సాగిందన్న షర్మిల

వైఎస్సార్ హయాంలో సంక్షేమ పాలన సాగిందన్న షర్మిల

ఇక ఇదే సమయంలో వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రం ఏ విధంగా ఉంది అన్నది గుర్తు చేసిన షర్మిల వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం పండగ అయిందని, ఉచిత విద్య, వైద్యం అందని, బడులు బాగు పడ్డాయని పేర్కొన్నారు. పిల్లలకు స్కాలర్ షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ లు అందాయని షర్మిల వెల్లడించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగారని పేర్కొన్న షర్మిల, మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలన్నా, సమస్యలు తొలగిపోవాలంటే వైయస్సార్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పైనా వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్ పైనా వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు


అంతేకాదు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన షర్మిల వైయస్ రాజశేఖర్ రెడ్డి 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి, రెండు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చేలా చేశారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చి వెన్నుపోటు పొడిచిందని వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఆయన మరణం పైన కనీసం ఎంక్వయిరీ కూడా చేయలేదని వైయస్ షర్మిల మండిపడ్డారు. బతికుండగా రాజశేఖర్ రెడ్డిని పొగిడిన కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోగానే నిందలు వేసిందని ఆమె ఆరోపించారు. నిందలు వేసిన రాజశేఖర్ రెడ్డి ఫోటోలు పెట్టుకుని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఓట్లు ఎట్లా అడుగుతున్నారని వైయస్ షర్మిల మండిపడ్డారు. తన తండ్రి వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేవారని వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు.

English summary
YS Sharmila targeted Minister Harish Rao on whether the health examinations have been stopped. She also attacked the Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X