పట్టపగలు పందికొక్కుల్లా రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు.. కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో రాష్ట్రం ఆగమైంది!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో పర్యటన సాగిస్తున్న వైయస్ షర్మిల తన పాదయాత్ర ద్వారా ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా అక్కడి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ అసమర్థతను, సీఎం కేసీఆర్ పాలన వైఫల్యాలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. ఇక తాజాగా మానకొండూరు లో ప్రజా ప్రస్థానం పాదయాత్రను సాగించిన షర్మిల ప్రజల సమస్యల పరిష్కారానికి తాను పాదయాత్ర చేస్తున్నా అని వెల్లడించారు. కార్మిక, కర్షక లోకం బలోపేతం కావడం కోసం వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పని చేస్తుందని పేర్కొన్నారు.
కేసీఆర్ దిక్కుమాలిన నిర్ణయాలు.. అడుగడుగునా అవినీతి
ఇక ఇదే సమయంలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల కెసిఆర్ తన దిక్కుమాలిన నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, ఆయన నిర్ణయాల కారణంగా తెలంగాణ ఆగమైందని వైయస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అర్హులకు పింఛన్లు లేవు. కౌలు రైతుకు సాయం లేదు అని అసహనం వ్యక్తం చేశారు. కెసిఆర్కుటుంబమంతా పదవులు అనుభవిస్తూ.. వేల కోట్లకు పడగలెత్తారని వైయస్ షర్మిల విమర్శించారు. కాళేశ్వరంలో కమీషన్లు దోచుకుని, విమానాలు కూడా కొంటున్నారని వైయస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు.
ఎవరికి ఏమైనా రాష్ట్రంలో పట్టించుకునేవారు లేరు: వైఎస్ షర్మిల అసహనం
కాళేశ్వరం అవినీతిపై కేవలం వైయస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమే పోరాడుతుందని, మిగతా పార్టీలు ఆ పని చేయడం లేదని వైయస్ షర్మిల పేర్కొన్నారు. అంతే కాదు రోగమొచ్చినా, ఆపదొచ్చినా బంగారు తెలంగాణలో పట్టించుకునే నాథుడే లేడని పేర్కొన్న వైయస్ షర్మిల ఇంట్లో ఒక్కరికే పింఛన్ ఇస్తూ.. మిగిలిన వారిని పస్తులుంచుతున్నారన్నారు. 25వేల విలువైన పథకాలు బంద్ పెట్టి, 5వేల రైతుబంధు ఇస్తూ పబ్బం గడుపుతున్నారని నిప్పులు చెరిగారు. భూమి లేనోడికి, కౌలు రైతుకు నయాపైసా సాయం లేదు. ఇదేం దిక్కుమాలిన పాలన? అంటూ సీఎం కేసీఆర్ పాలన పై విరుచుకుపడ్డారు.

బంగారు తెలంగాణా అయ్యింది వారికే
తెలంగాణ బంగారు తెలంగాణ ఎక్కడ అయ్యిందో చూపించాలని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కెసిఆర్ కుటుంబానికి, కెసిఆర్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు బంగారు తెలంగాణ అయిందని, తరాలకు సరిపడా సంపాదించుకున్నారని వైయస్ షర్మిల విమర్శించారు. పట్టపగలే పందికొక్కులా దోచుకుతింటున్నారు కేసీఆర్ సార్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఖజానాని కొల్లగొట్టారని, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు లోనే లక్ష కోట్ల అవినీతి చేశారని వైయస్ షర్మిల విమర్శించారు. మాయమాటలతో మోసం చేసే కెసిఆర్ ను నమ్మొద్దని, ఇంటికి పెద్ద కొడుకునని చెబుతూ మోసం చేస్తున్న కెసిఆర్ కి తగిన బుద్ధి చెప్పాలని వైయస్ షర్మిల తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications