నాది ఆంధ్రా అయితే సోనియా ఎక్కడ? రేవంత్ రెడ్డి భయం అందుకే: వైఎస్ షర్మిల
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య ఏదో ఒక అంశంలో వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల రాజకీయాలను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్న వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
తాజాగా మరోమారు వైయస్ షర్మిలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనది ఆంధ్రా అయితే మరి సోనియాగాంధీ ఎక్కడ.. ఇటలీ కాదా అంటూ వైయస్ షర్మిల ప్రశ్నించారు. ఒక ప్రాంతాన్ని వదిలేసి సొంత వాళ్లను కాదనుకొని పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వచ్చి, పిల్లల్ని కని మహిళ తనను తానే అంకితం చేస్తుంది అని షర్మిల పేర్కొన్నారు.

అత్త వారి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ పిల్లనే అవుతుందని, అదే తన ప్రపంచం గా మారుతుందని పేర్కొన్న షర్మిల భారతదేశ సంస్కృతి, గొప్పదనం ఇదే అన్నారు. ఇంత గొప్ప సంస్కృతి అర్థం చేసుకోవాలంటే సంస్కారం ఉండాలని , అంతటి సంస్కారం రేవంత్ రెడ్డికి లేదని వైయస్ షర్మిల మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తనను పోటీగా ఫీలవుతున్నారని, ఆయన అభద్రతా భావంతో ఉన్నారని పేర్కొన్నారు.
షర్మిల తన వల్ల ఆయన ఉనికి ఎక్కడ దెబ్బ తింటుందో అని భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే రేవంత్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. అసలు జై తెలంగాణ అనే హక్కు రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కు, నరేంద్ర మోడీ, సోనియాలకు ఎవరికీ లేదన్నారు. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్న పార్టీ అని షర్మిల చెప్పారు.

తాను తెలంగాణలో రాజకీయాలు చేస్తే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని ఆమె విమర్శించారు. ఇక రేవంత్ రెడ్డి అల్లుడు కూడా ఆంధ్రా నే అని గుర్తు చేసిన వైయస్ షర్మిల ముందు ఆ సంగతి ఏంటో చూసుకోవాలంటూ రేవంత్ రెడ్డికి హితవు పలికారు.












Click it and Unblock the Notifications